Movie News

ఇద్దరి ఆశలన్నీ మంగళవారం మీదే

ఆరెక్స్ 100తో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి ఆ తర్వాత అట్టే కలిసి రాలేదు. అందులో పాత్ర నెగటివ్ టచ్ ఉన్నది కావడంతో ఎంత పేరొచ్చినా హీరోలు తమ పక్కన జోడిగా తీసుకునేందుకు జంకారు. సరే పోన్లే ఇంకో విధంగా ట్రై చేద్దామని వయసు వ్యత్యాసం పట్టించుకోకుండా వెంకటేష్ లాంటి సీనియర్ హీరోతో వెంకీ మామలో ఆడి పాడితే దాని యావరేజ్ ఫలితం ఏ మాత్రం ఉపయోగపడలేదు సరికదా ఆ తర్వాత కెరీర్ ఇంకాస్త డల్ అయిపోయింది. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా అవేవీ జనానికి కనీసం గుర్తు లేవు.

అందుకే ఇప్పుడు మళ్ళీ తనకు మొదటి అవకాశం ప్లస్ బ్రేక్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితోనే జట్టు కడుతోంది. మంగళవారం పేరుతో రూపొందుతున్న ఈ మూవీ ప్రీ లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు. కాన్సెప్ట్ ఏదో డిఫరెంట్ గా ఉండబోతోందన్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం పాయల్ పాత్రకు చాలా షేడ్స్ ఉంటాయట. ఎవరూ ఊహించని ట్విస్టుతో ప్రతి మంగళవారం జరిగే అనూహ్య సంఘటనలకు తన క్యారెక్టర్ కు ఏదో బలమైన లింక్ తో ఆడియన్స్ కి షాక్ ఇచ్చేలా డిజైన్ చేసినట్టు వినికిడి. థ్రిల్లర్ జానర్ అనే క్లారిటీ అయితే ఉంది.

ఇది సక్సెస్ కావడం అజయ్ కు సైతం చాలా కీలకం. ఎందుకంటే రెండో చిత్రం మహా సముద్రం అంత బడ్జెట్ శర్వానంద్ సిద్దార్థ్ లాంటి క్యాస్టింగ్ ఉన్నా డిజాస్టర్ అందుకోవాల్సి వచ్చింది. టేకింగ్ ఎలా ఉన్నా అసలు కథ మీద నెగటివిటీ వచ్చింది. దెబ్బకు స్టార్ హీరోల నుంచి పిలుపులు రాలేదు. రవితేజకు స్టోరీ ఒప్పించడం దగ్గరి నుంచి ఇక్కడి దాకా వచ్చిన అజయ్ భూపతి ఈ మంగళవారంతోనే కంబ్యాక్ అవ్వాల్సి ఉంటుంది. ముప్పైకి పైగా నటీనటులు ఉన్నారట. షాలిని పాండే మరో హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటిదాకా రాని కస్టోరీ అంటున్నారు ఏంటో మరి.

This post was last modified on February 28, 2023 3:14 pm

Share

Recent Posts

ఫోన్ ట్యాపింగ్ రచ్చ.. రాహుల్‌కు పీకే మద్దతు

దేశంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్‌(స‌ర్‌), కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా…

2 minutes ago

హసీనాను బంగ్లాకు పంపడానికి భారత్ షరతులు?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ తన దేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2026 డిసెంబర్ లో ఆమె…

3 minutes ago

మమ్ముట్టి భార్యగా రేణు దేశాయ్?

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న సంగతి తెలిసిందే. ఆమె నటిగా సత్తా చాటుకుంది.…

21 minutes ago

మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని ఆస్వాదించిన ఆనంద్ మహీంద్రా

రోజూ ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌లో నోటిఫికేషన్లు చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే…

1 hour ago

కొత్త వివాదాలు తెచ్చేలా ఉన్న ఓమ్

ఈ నెల నవంబర్ 20 విడుదల కాబోతున్న ఓమ్ మీద మూవీ లవర్స్ లో ప్రత్యేకమైన అంచనాలున్నాయి. పేరుకు తమిళ…

2 hours ago

ఎన్విడియా ఉద్యోగులు మళ్ళీ అతన్నే కోరుకుంటున్నారు

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియాలో ఊహించని పరిస్థితి నెలకొంది. కంపెనీని 33 ఏళ్ల పాటు నడిపించిన జెన్సన్…

2 hours ago