ఒకే నిర్మాణ సంస్థ నుంచి ఒక్క రోజు వ్యవధిలో రెండు సినిమాలు రిలీజ్ కావడం.. అవి రెండూ ఇద్దరు టాప్ స్టార్లు నటించిన భారీ చిత్రాలు కావడం.. పైగా అది సంక్రాంతి సీజన్ కావడం ఊహకందని విషయం. 2023 సంక్రాంతికి ఇదే జరిగింది.
మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణతో వీరసింహారెడ్డి చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. రెంటినీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసింది. ఇదే అరుదైన విషయం అంటే.. ఆ రెండు చిత్రాలూ బాక్సాపీస్ దగ్గర మంచి పలితాలు అందుకుని మైత్రీ వారికి లాభాలు తెచ్చిపెట్టడం మరో విశేషం. కాగా వచ్చే ఏడాది సంక్రాంతికి ఇలాంటి అరుదైన విషయమే జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈసారి ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండు సినిమాలు వస్తే.. వచ్చే ఏడాది ఒకే దర్శకుడి నుంచి రెండు సినిమాలు రిలీజవుతాయట. ఆ దర్శకుడు శంకర్ అని అంటున్నారు. ఆయన ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలు తీస్తున్నారు. ఒకటి రామ్ చరణ్‌తో దిల్ రాజు నిర్మాణంలో చేస్తున్న సినిమా కాగా.. ఇంకోటి ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉండి ఈ మధ్యే తిరిగి సెట్స్ మీదికి వెళ్లిన ఇండియన్-2. ఈ సంక్రాంతికే అనుకున్న చరణ్ సినిమా.. మధ్యలో ఇండియన్-2 తెరపైకి రావడం, ఇతర కారణాల వల్ల వాయిదా పడింది. ఆ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.
మరోవైపు ఇండియన్-2 ప్రొడక్షన్ హౌస్ లైకా సంస్థ అధినేతలు కూడా 2024 సంక్రాంతి మీదే కన్నేశారు. ఈ సినిమా పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ అంతా అయ్యేసరికి ఈ ఏడాది గడిచిపోతుంది. వచ్చే సంక్రాంతే రిలీజ్‌కు సరైనటైమింగ్ అనుకుంటున్నారు. దర్శకుడు ఒకడే అయినప్పటికీ.. హీరోలు, నిర్మాతలు వేరు కాబట్టి ఎవరిష్టం ఇక్కడ శంకర్‌కు వచ్చిన ఇబ్బంది లేదు. మరి నిజంగానే ఈ సినిమాలు రెండూ ఒకేసారి రిలీజవుతాయేమో చూడాలి.
This post was last modified on February 28, 2023 10:04 am
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…