నటి, యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో తరచుగా నెటిజన్లతో డిష్యుం డిష్యుం నడుస్తుంటుంది. సెలబ్రెటీల మీద సోషల్ మీడియాలో ఊరూ పేరు లేని వాళ్లు పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం మామూలే. చాలామంది ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతుంటారు. కానీ అనసూయ ఆ టైపు కాదు. తను పెట్టే పోస్టుల మీద ఎవరైనా నెగెటివ్ కామెంట్లు చేస్తే వాళ్లకు ఆమె దీటుగా బదులిస్తుంటుంది. అవతలి వాళ్లు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతుంటారు. ఆమె వైపు నెగెటివ్ పాయింట్లు పట్టుకుని ట్రోల్ చేస్తుంటారు.
కొన్ని నెలల కిందట అనసూయను ఒక నెటిజన్ ఆంటీ అనడం.. అందుకు ఆమె హర్టయి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం.. ఆ తర్వాత అదే పనిగా కొందరు ఆంటీ ఆంటీ అంటూ ఆమెను ట్రోల్ చేయడం తెలిసిందే. ఆంటీ అంటే ఎందుకు ఫీలవుతారో తెలియదు అంటూ ఆమె పాత కామెంట్లను పట్టుకుని కౌంటర్లు ఇచ్చింది ఆ వర్గం.
ఈ ‘ఆంటీ’ గొడవ ఎంత వరకు వెళ్లిందంటే.. థియేటర్లలో ఏదైనా సినిమాల్లో అనసూయ పాత్ర కనిపిస్తే ఆంటీ ఆంటీ అని కుర్రాళ్లు అరిచే స్థాయికి వెళ్లింది. అనసూయను ఇలా సంబోధించడంపై సీనియర్ నటి కస్తూరి ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. ఆమెకు మద్దతుగా కస్తూరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.
“చిన్న పిల్లలు ఆంటీ అనడానికి, కొంచెం వయసు వచ్చిన వాళ్లు అలా అనడానికి తేడా ఉంటుంది. చిన్నపిల్లలు గౌరవంతో పిలుస్తారు. పెద్ద వయసు వాళ్లు ఒక మహిళను అలా అంటున్నారంటే అది సరైన పద్ధతి కాదు. అనసూయను ఆంటీ అని కామెంట్ చేయడం తప్పు. ఇండస్ట్రీలో ఆమె కంటే పెద్ద వయసు నటులున్నారు. వాళ్లను అ:కుల్ అని పిలుస్తున్నారా? ఆంటీ అనే పదానికి ఈ మధ్య చెత్త అర్థాలు వచ్చాయి. అనసూయను ఆంటీ అంటున్నారంటే దురుద్దేశంతో అయినా అయ్యుండాలి.. లేదా ఆమెను అగౌరవపరచాలనే అంటుండాలి” అని కస్తూరి అంది. మరోవైపు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకకు హాజరైనపుడు ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్‌లో ఇంగ్లిష్ మాట్లాడడంలోనూ తప్పేమీ లేదని.. అతణ్ని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని కస్తూరి అభిప్రాయపడింది.
This post was last modified on February 27, 2023 10:40 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…