సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ ఒడుదొడుకులతో సాగుతోంది. సంక్రాంతి సినిమాల తర్వాత నెల రోజుల వ్యవధిలో ఒక్క ‘రైటర్ పద్మభూషణ్’ మాత్రమే సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత శివరాత్రి వీకెండ్లో రిలీజైన ‘సార్’ మంచి ఫలితాన్నే అందుకోగా.. అదే వారాంతంలో వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ కూడా పర్వాలేదనిపించింది. కానీ ఈ వీకెండ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ పూర్తిగా వెలవెలబోయింది.
గత వారం థియేటర్లు బోలెడన్ని అందుబాటులో ఉన్నా ఉపయోగించుకోవడానికి చెప్పుకోదగ్గ కొత్త సినిమా ఒకటీ లేదు. ఊరూ పేరూ లేని సినిమాలేవో వచ్చాయి వెళ్లిపోయాయి. ఇక తర్వాతి వారం కూడా బాక్సాఫీస్ కళ తప్పేలాగే కనిపిస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘బలగం’ అనే చిన్న సినిమా తప్ప చెప్పుకోదగ్గ రిలీజ్‌లు ఉండే అవకాశం కనిపించడం లేదు.
ఇది అన్ సీజనే అయినప్పటికీ.. రెగ్యులర్ సినీ గోయర్స్ ఏ కొత్త సినిమా వచ్చినా చూడడ్డానికి రెడీగా ఉంటారు. మంచి టాక్ తెచ్చుకుని ఈ టైంలో కూడా బాగా ఆడిన సినిమాలు లేకపోలేదు. కానీ పోటీయే లేని ఈ సమయాన్ని ఉపయోగించుకునే సినిమా కనిపించడం లేదు. ‘బలగం’ కూడా ఛాన్స్‌ను వాడుకోవట్లేదు. దిల్ రాజు నిర్మించాడంటే ప్రమోషన్ల పరంగా కొంచెం హడావుడి ఉండాలి. బజ్ పెంచాలి. కానీ ‘బలగం’కు స్టార్ కాస్ట్ లేకపోవడం, ఇదేదో తెలంగాణ సినిమా అనే ముద్ర పడిపోవడం వల్ల మొత్తంగా అనుకున్నంత బజ్ రాలేదు.
యూత్‌ను ఆకర్షించేలా ప్రోమోలు ఇప్పటిదాకా ఏవీ రిలీజ్ కాలేదు. కనీసం రిలీజ్ వీక్‌లో అయినా జోరు పెంచాల్సిన అవసరముంది. ఈ చిత్రంతో కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతుండడం విశేషం. ఈ చిత్రంలో ప్రియదర్శి సహా తెలంగాణ నటీనటులే ముఖ్య పాత్రలను పోషించారు.
This post was last modified on February 26, 2023 9:39 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…