ఫిబ్రవరి నెల 2వ తేదీన కళా తపస్వి కె.విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఇక ఇప్పుడు విశ్వనాథ్ శ్రీమతి జయలక్ష్మి ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు. విశ్వనాథ్ మరణించి ఇంకా నెల రోజులు కూడా కాకుండానే ఆమె మరణించడం నిజంగా షాక్ అనే చెప్పాలి. ఆమె వయస్సు 86 సంవత్సరాలు. అయితే ఆమె ఇంత వరకు ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలతో బాధపదలేదని తెలుస్తోంది.
అయితే భర్త మరణంతో ఆమె మానసికంగా కృంగిపోయినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో భర్త మరణించిన 24 రోజుల్లో ఆమె కూడా మృతి చెందడం తీరని లోటు. కె విశ్వనాథ్ మరణించిన కొద్ది రోజుల్లోనే అతని వెంటే భార్య జయలక్ష్మి కూడా మృత్యువాత పడటంతో వారి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.
లెజెండరీ దర్శకుడిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న వ్యక్తి కె విశ్వనాథ్. కళాతపస్వి బిరుదుని అలంకరించిన విశ్వనాథ్ తన సినిమాలతోనే ఆ పేరుకి సార్ధకత చేసుకున్నారు అని చెప్పాలి. శంకరాభరణం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అన్ని భాషలలో రిలీజ్ అయిన మొదటి పాన్ ఇండియా సినిమా అని చెప్పాలి. ఈ మూవీతో నేషనల్ అవార్డుని కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఇక విశ్వనాథ్ ప్రతి సినిమా ఒక ఆణిముత్యం లాంటిది.
92 ఏళ్ళ వయస్సులో విశ్వనాథ్ మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయింది అని చెప్పాలి. కె విశ్వనాథ్ చివరిగా అల్లరి నరేష్ తో శుభప్రదం అనే సినిమా చేశారు. ఈ సినిమా తర్వాత వయస్సు, ఆరోగ్య రీత్యా సినిమాలని దర్శకత్వం చేయడం వదిలేసారు. అయితే నటుడిగా తరువాత కొంతకాలం ట్రావెల్ చేశారు.