అనసూయ భరద్వాజ్ నటిగా ఎన్ని సినిమాలు చేసినా కూడా.. ‘జబర్దస్త్’ షోలో చేస్తున్నపుడు తన పాపులారిటీ వేరు. ఆమె ఎవరో జనాలకు తెలిసింది.. పాపులర్ అయింది ఈ షోతోనే. సినిమాల్లో బిజీ అయ్యాక వాటితో వచ్చిన పేరు కంటే కూడా ప్రతి వారం ‘జబర్దస్త్’ షోలో కనిపిస్తూ.. అందుకోసం ఫొటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కువ హైలైట్ అయ్యేది అనసూయ.
కానీ ఆ షోకు ఆదరణ తగ్గిపోయింది. అదే సమయంలో అనసూయ కూడా షోకు దూరమైంది. దీంతో అనసూయ పేరు సోషల్ మీడియాలో పెద్దగా వినిపింంచడం లేదు. కానీ అప్పుడప్పుడూ ఆమె నెటిజన్లతో చేసే చిట్ చాట్‌లు చర్చనీయాంశం అవుతుంటాయి. తాజాగా నెటిజన్లతో జరిపిన సంభాషణలో అనసూయకు ఎదురైన ప్రశ్న.. ఆమె దానికి ఇచ్చిన సమాధానం అందరి దృష్టినీ ఆకర్షించింది.
మీరు నిజంగా లిబరల్, మెచ్యూర్డ్ ఉమన్ అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటూ.. “మీకు ఎప్పుడైనా లెస్బియన్లతో అనుభవాలు ఎదురయ్యాయా” అని అడిగాడు ఒక నెటిజన్. దీనికి అనసూయ ఏమాత్రం తడబడకుండా జవాబు ఇచ్చింది. “నా స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో గేలు ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా నాకెవ్వరూ అలాంటి వాళ్లు తగల్లేదు. ఇక ఆన్ లైన్లో అంటారా? చాలామందే ఎదురయ్యారు” అని అనసూయ చెప్పింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు ఎదురైన ఈ ప్రశ్న.. జవాబుకు సంబంధించి స్క్రీన్ షాట్ కూడా తీసి ఆమె పోస్ట్ చేయడం విశేషం. తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల్లో ‘గే’లు ఉన్నారంటూ బోల్డ్‌గా ఆమె చెప్పిన సమాధానం చూసి చాలామంది అభినందిస్తున్నారు. ‘జబర్దస్త్’ షోకు దూరమైనప్పటికీ.. అనసూయ ప్రస్తుతం ‘పుష్ప-2’ సహా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates