మైత్రి తర్వాత సితారనే !

తెలుగులో ఏ సూపర్ హిట్ కొట్టిన దర్శకుడిని అడిగినా నెక్స్ట్ మైత్రి కి ఓ సినిమా చేయాల్సి ఉందని చెప్తాడు. ఇది కామన్. సినిమా టాక్ బయటికి రాగనే మైత్రి నిర్మాతలు ఆ దర్శకుడికి తర్వాత హీరోకి ఎడ్వాన్స్ లు ఇచ్చేసి డేట్స్ బ్లాక్ చేసుకుంటారు. అందుకే మైత్రి ఎడ్వాన్సులు ఎందరో దర్శకుల చేతిలో ఉంటాయి. చిన్న డైరెక్టర్ నుండి స్టార్ డైరెక్టర్ వరకూ మైత్రి ఎడ్వాన్సులు అందుకున్న దర్శకులెందరో ఉన్నారు. ఇప్పుడు మైత్రి తర్వాత అన్ని ఎడ్వాన్సులు ఇస్తూ అగ్ర సంస్థ ఎదిగే క్రమంలో ఉన్నది సీతారనే.

సితార ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ మెల్ల మెల్లగా ఎదుగుతుంది. మొన్నటి వరకు ఈ బేనర్ లో మీడియం బడ్జెట్ సినిమాలు , చిన్న సినిమాలే వచ్చాయి. ‘భీమ్లా నాయక్’ తో ఈ బేనర్ బడా సంస్థ గా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ నుండి దాదాపు పది మంది కుర్ర దర్శకులు ఎడ్వాన్సులు అందుకున్నారు. ముఖ్యంగా వెంకీ అట్లూరి , వివేక్ ఆత్రేయ, గౌతం తిన్ననూరి ఇలా నాగ వంశీ నుండి ఎడ్వాన్సులు తీసుకున్న లిస్టు చాలానే ఉంది. క్రేజీ హీరోల లైనప్ లో కూడా సితార ఉంది.

ప్రస్తుతం సార్ తో ఈ బేనర్ కి మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. ఈ సక్సెస్ ఊపుతో సినిమా ప్రొడక్షన్ కౌంట్ పెంచే పనిలో ఉన్నాడు నిర్మాత నాగ వంశీ. ఈ బేనర్ లో ఏడాదికి నాలుగైదు సినిమాలు నిర్మించే ప్లానింగ్ లో ఉన్నాడు. అందుకే సక్సెస్ కొట్టిన దర్శకులకు , ఫామ్ లో ఉన్న హీరోలకి ఎడ్వాన్సులు ఇస్తూనే ఉన్నారు. కానీ ఎక్కువ ఎడ్వాన్సులు ఇచ్చినా ఇబ్బందే. తాజాగా పరశురామ్ విషయంలో గీతా ఆర్ట్స్ 2 సంస్థ ఇబ్బంది పడాల్సి వచ్చింది.