ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ పుష్ప 2 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నత్త నడకన సాగుతూ ముందుకెళ్తుంది. ఈ సీక్వెల్ కోసం అల్లు అర్జున్ ఎక్కువ ఫోకస్ పెట్టనున్నాడు. పార్ట్ 1 కంటే పుష్ప ది రూల్ లో ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేలా సుక్కు , బన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడానేది ఎనౌన్స్ చేయలేదు. లైనప్ అయితే పెద్దగానే ఉందని తెలుస్తుంది. అందులో ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా కూడా ఉంది.
అయితే మిగతా దర్శకులను పక్కన పెట్టేసి పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ తోనే చేతులు కలిపే అవకాశం ఉంది. అవును తాజాగా అల్లు అర్జున్ కి ఓ లైన్ చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు త్రివిక్రమ్. సుకుమార్ తర్వాత బన్నీ ఎక్కువ సినిమాలు చేసింది త్రివిక్రమ్ తోనే. ‘జులాయ్’ , ‘సం ఆఫ్ సత్యమూర్తి’ , తర్వాత వచ్చిన ‘అల వైకుంఠ పురములో’ సినిమా ఈ కాంబోకి ఇండస్ట్రీ హిట్ అందించింది.
ఆ సినిమా కంటే ముందు కొన్ని సీరియస్ యాక్షన్ సినిమాలు చేశాడు బన్నీ. అల వైకుంఠ పురములో సరదాగా ఓ టైమ్ పాస్ ఎంటర్టైనర్ చేయాలని ఇద్దరు ప్లాన్ చేసుకొని చేసిన సినిమా. అది ఊహించని విధంగా భారీ వసూళ్లు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ‘పుష్ప 2’ తర్వాత కూడా బన్నీ త్రివిక్రమ్ తో అలాంటి టైమ్ పాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. సీరియస్ సినిమాల తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే బాగుంటుందని అందుకే సుకుమార్ సినిమా కంప్లీట్ అవ్వగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ తోనే సినిమా చేస్తాడని టాక్ గట్టిగా వినబడుతుంది.
This post was last modified on February 26, 2023 9:25 am
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…