సీనియర్ హీరో అర్జున్ కేవలం నటుడే కాదు.. రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. జైహింద్ సహా పలు చిత్రాలకు తనే స్క్రిప్టు సమకూర్చుకుని డైరెక్ట్ చేశాడు అర్జున్. తన సినిమాలు కొన్నింటిని సొంతంగా ప్రొడ్యూస్ చేసుకున్నాడు కూడా. ఐతే చాలా ఏళ్లుగా అర్జున్ సినిమాలు పెద్దగా వర్కవుట్ కావట్లేదు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని.. స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా తీయడానికి గత ఏడాది ప్రణాళిక వేసుకున్నాడు. ఆ సినిమాలో తెలుగు యువ కథానాయకుడు విశ్వక్సేన్‌ను హీరోగా తీసుకున్నాడు. తన కూతురు ఐశ్వర్యనే కథానాయికగా ఎంచుకున్నాడు.
ఐతే ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ ద్విభాషా చిత్రం.. మధ్యలో ఆగిపోయింది. స్క్రిప్టు నచ్చకో, అర్జున్‌తో పొత్తు కుదరకో.. విశ్వక్ ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడు. దీని మీద తీవ్ర ఆవేదనతో అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. తర్వాత విశ్వక్ తన వైపు నుంచి ఏదో వివరణ ఇచ్చాడు.
మొత్తానికి ఆ సినిమా అక్కడితో అటకెక్కేసినట్లే కనిపించింది. విశ్వక్ స్థానంలో వేరే హీరో ఎవరినీ ఎంచుకోలేదు. ఈ సినిమాను ముందుకూ తీసుకెళ్లలేదు. కట్ చేస్తే ఇప్పుడు అర్జున్ ఒక సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మలయాళంలో టాప్ స్టార్ అయిన మోహన్ లాల్ హీరోగా అర్జున్ ఓ బహు భాషా చిత్రాన్ని తీయబోతున్నాడట.
లాల్ పెద్ద స్టారే కానీ.. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేయడం, నాన్చడం ఏమీ ఉండదు. చకచకా కొన్ని నెలల్లోనే ఒక సినిమా లాగించేస్తుంటాడు. చిన్న, పెద్ద.. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా అందరు దర్శకులతోనూ పని చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆయన అర్జున్‌తో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అర్జున్ స్టయిల్లోనే ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. విశ్వక్ మిస్సయినా లాల్ లాంటి టాప్ హీరోను ఒప్పించాడంటే అర్జున్ సమర్థుడే.
This post was last modified on February 26, 2023 9:21 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…