ఉన్నపళంగా షూటింగ్స్ మొదలు పెట్టినా కానీ వకీల్ సాబ్ షూటింగ్ మాత్రం నవంబర్ వరకు మొదలయ్యే ఛాన్సే లేదు. పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేబూని ఇప్పుడు ఏ గెటప్ లో ఉన్నాడో చూసే వుంటారు. అక్టోబర్ నెలాఖరు వరకు పవన్ ఇలాగే ఉంటారు కనుక షూటింగ్ మొదలు పెట్టే వీలు లేదు.
సంక్రాంతికి ఈ సినిమా సిద్ధం చేయాలని దిల్ రాజు చూస్తున్నాడు. ఇంకా నెల రోజుల షూటింగ్ బాకీ ఉందట. అంటే నవంబర్ లో కచ్చితంగా మొదలైతే తప్ప పోస్ట్ ప్రొడక్షన్ పనులూ అవీ పూర్తి కావు. అయితే పవన్ నమ్మకం ప్రకారం అక్టోబర్ వరకు కరోనా తగ్గుముఖం పట్టదట. అందుకే దిల్ రాజుకి సమాచారం అందించిన తర్వాతే పవన్ ఈ దీక్ష చేపట్టాడట.
ఒకవేళ అప్పటికి కూడా పరిస్థితులు చక్కబడని పక్షంలో వకీల్ సాబ్ సంక్రాంతి స్లాట్ నుంచి తప్పుకుని సమ్మర్ కి వెళ్తాడు. వకీల్ సాబ్ ఎంత డిలే అయితే అంతకు ఒక రెండు నెలలు క్రిష్ సినిమా కూడా లేట్ అవుతుంది. అలాగే హరీష్ శంకర్ ఎదురుచూపులు కూడా అంతకు అంతా పెరుగుతాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates