హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళాల్సి ఉంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు వాడే బిరుదుని టైటిల్ లో పెట్టుకోవడం పట్ల తొలుత ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అదేమంత ఇష్యూ కాలేదు. తాజాగా ఇందులో సగం పేరుని వాడేసుకుని ఓ అప్ కమింగ్ హీరో వచ్చేస్తున్నాడు. సింహా కోడూరి నటించిన కొత్త చిత్రానికి ఉస్తాద్ గా నామకరణం చేసి ఇవాళ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఎయిర్ ఫోర్స్ పైలట్ గా సింహా నటిస్తున్న ఈ బయోపిక్ ఎవరి కథ ఆధారంగా రూపొందిందనేది ఇంకా రివీల్ కాలేదు.
వారాహి బ్యానర్ మీద సాయి కొర్రపాటి నిర్మించిన ఉస్తాద్ కి ఫణిదీప్ దర్శకత్వం వహించగా అకీవా సంగీతం సమకూరుస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉన్నప్పటికీ సింహ కోడూరికి ఆశించిన సక్సెస్ లు రావడం లేదు. మత్తు వదలరా హిట్ తర్వాత వరస పరాజయాలు పలకరించాయి. తెల్లవారితే గురువారం డిజాస్టర్ అయ్యింది. దొంగలున్నారు జాగ్రత్త కనీసం రెండు రోజులు కూడా ఆడలేక చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేయబోయేవి విజయం సాధించడం కీలకంగా మారింది. అసలే కుర్రహీరోలకు బాక్సాఫీస్ వద్ద కలిసి రావడం లేదు.
ఈ ఉస్తాద్ తో పాటు భాగ్ సాలె కూడా షూటింగ్ పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.టైటిల్ అయితే చెప్పేశారు కానీ ఇటు పవన్ ఫ్యాన్స్ అటు రామ్ అభిమానులు ఇద్దరూ పెట్టుకోవడానికి ఈ ట్యాగే దొరికిందాని కామెంట్లతో నిలదీస్తున్నారు. సినిమా చూడకుండా ఒక నిర్ణయానికి వచ్చేయడం కరెక్ట్ కాదు కానీ ఈ మధ్య ఇలాంటివి కొద్దిరోజులు హడావిడి చేయడం ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం కామన్ గా జరుగుతోంది. నాని గ్యాంగ్ లీడర్ టైంలో మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ గుర్తేగా. అయినా ఉస్తాద్ లాంటి పవర్ ఫుల్ ఎలివేషన్లు ఇలాంటి అప్ కమింగ్ హీరోకు ఎంతమేరకు సెట్ అవుతాయో చూడాలి.
This post was last modified on February 23, 2023 12:30 pm
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…