అల్లరి నరేష్ తో విజయ్ కనకమేడల తీస్తున్న ‘ఉగ్రం’ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజైంది. ఇందులో నరేష్ ఓ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నాడని చూపించారు. నిజానికి ‘నాంది’ సూపర్ హిట్ అవ్వగానే దర్శకుడు విజయ్ నాగ చైతన్య ను అప్రోచ్ అయ్యాడు. చైతు కి కథ చెప్పేసి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. సినిమా కోసం ఆఫీస్ తీయడం, విజయ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయడం అన్నీ జరిగాయి. కానీ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ కాకుండానే క్యాన్సల్ అయింది.
దీంతో విజయ్ తనకి మొదటి అవకాశం ఇచ్చిన అల్లరి నరేష్ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకొని ‘ఉగ్రం’ ను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. అయితే చైతు కి విజయ్ ఉగ్రం కథే చెప్పి ఉండొచ్చు. కానీ అదే టైమ్ లో వెంకట్ ప్రభు చెప్పిన ‘కస్టడీ’ లో కూడా పోలీస్ పాత్రే కాబట్టి చైతు విజయ్ కి నో చెప్పేసి ఎప్పటి నుండి అనుకుంటున్న వెంకట్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఉండొచ్చు.
‘ఉగ్రం’ టీజర్ ను చైతూనే లాంచ్ చేశాడు. ‘నాంది’ తర్వాత విజయ్ తో కొన్ని ఐడియాస్ తో ట్రావెల్ చేశానని చెప్పుకున్నాడు. సో చైతు మాటలను బట్టి కూడా నరేష్ కంటే ముందు విజయ్ చైతూ కోసమే ఈ స్టోరీ మీద వెంకట్ తో కలిసి వర్క్ చేశాడని అర్థమవుతుంది. ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం చైతు ఓ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాను మిస్ చేసుకున్నట్లే మరి.
This post was last modified on February 22, 2023 10:49 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…