తెలుగు , తమిళ్ లో బిజీ ఆర్టిస్ట్ ఎవరంటే టక్కున వినిపించే పేరు సముద్రఖని. అవును దర్శకుడిగా ఎన్నో సినిమాలు చేసిన ఈయన నటుడిగా ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయాడు. తెలుగులో అల వైకుంఠ పురములో , క్రాక్ సినిమాలు సముద్రఖనిను బిజీ యాక్టర్ ను మార్చేశాయి. ఆ రెండు సినిమాల తర్వాత ఆయన చాలా తెలుగు సినిమాలు చేశాడు. తాజాగా ‘సార్’ లో మెయిన్ విలన్ గా నటించాడు.
అయితే ఇప్పుడు ఈ బిజీ యాక్టర్ మళ్ళీ మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా బిజీ అయ్యాడు. ఇటీవలే తమిళ్ లో ‘వినోదాయ సీతమ్’ తీశాడు సముద్రఖని. దర్శకత్వంతో పాటు ఇందులో దేవుడిగా కనిపించి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ , సాయి ధరం తేజ్ కాంబోలో రీమేక్ చేయనున్నాడు. హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయింది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఇరవై ఐదు రోజులు డేట్స్ ఇచ్చాడు. అంతా కలిపి రెండు మూడు నెలలలోనే షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ షూటింగ్ పూర్తయ్యే వరకు సముద్రఖని నటుడిగా మరో సినిమా చేసే అవకాశం లేదు. ఇందులోనే ఏదైనా ఇంపార్టెంట్ రోల్ ఉంటే చేసుకోవాలి తప్ప మరో సినిమా చేయడానికి కుదరని పని. తాజాగా రెండు పెద్ద సినిమాలకు కూడా ఆయన నో చెప్పేశాడని తెలుస్తుంది. మరి ఈ సీనియర్ యాక్టర్ ను మైండ్ లో పెట్టుకొని కేరెక్టర్ రాసుకున్న దర్శకులకు పెద్ద ఇబ్బందే. ఆయన దర్శకుడిగా చేసే సినిమా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తారా ? మరో ఆల్టర్నేట్ యాక్టర్ ను పెట్టుకుంటారా ? చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates