ఇప్పుడు ఇండియాలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ప్రాజెక్ట్-కే ఒకటి. బాహుబలి తర్వాత ఇండియాలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగిన ప్రభాస్ ప్రధాన పాత్రలో.. దీపికా పదుకొనే కథానాయికగా.. అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సినిమా కావడం.. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న చిత్రం.. పైగా బడ్జెట్ రూ.500 కోట్లు కావడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు.
గత ఏడాదే సెట్స్ మీదికి వెళ్లిన ఈ చిత్రం ఒకదాని తర్వాత ఒకటి షెడ్యూళ్లు పూర్తి చేసుకుంటోంది. 2024 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ సందర్బంగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అమితాసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది. అది ఓ నటుడి క్యామియో గురించి.
ప్రాజెక్ట్-కేను నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్‌లోనే సీతారామం లాంటి మెమొరబుల్ మూవీ చేసిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెరవనున్నాడట. సీతారామంలో లీడ్ రోల్‌కు దుల్కర్‌ను ఎంపిక చేసింది నాగ్ అశ్వినే. అతడితో నాగికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో దుల్కర్ కోసం ఒక ప్రత్యేక పాత్రను క్రియేట్ చేయడం.. అతణ్ని అడగ్గా ఓకే చెప్పడం జరిగాయట. దుల్కర్ నటిస్తే పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు మరింత ఆకర్షణ జోడించినట్లు అవుతుందని టీం భావించిందట.
త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదిత్య 369 తరహా సోషియా ఫాంటసీతో పాటు సైంటిఫిక్ టచ్ ఉన్న కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడు నాగ్ అశ్విన్.
This post was last modified on February 22, 2023 2:19 pm
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…