పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల ఓపెనింగ్స్ లో మరో కొత్త చాఫ్టర్ ఇవాళ మొదలయ్యింది. ఏడాదికిపైగా అదిగో ఇదిగో అంటూ వాయిదా పడుతూ వచ్చిన వినోదయ సితం రీమేక్ ఎట్టకేలకు ఈ రోజు అధికారికంగా పట్టాలు ఎక్కింది. మొదటి నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పట్ల ఏమంత ఆసక్తి చూపించడం లేదు. కారణం ఓటిటి రిలీజ్ అయిన మూవీ అందులోనూ స్టార్ హీరోలు లేనిది పవన్ ఏరికోరి చేయడం ఏమిటని వాళ్ళ నిలదీత. అందులో లాజిక్ ఉంది కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఇద్దరి ఇమేజ్ కి తగ్గట్టు చాలానే మార్పులు చేశారట.
కేవలం ఇరవై రోజుల కాల్ షీట్స్ తో మొత్తం షూటింగ్ పూర్తి చేస్తారనే టాక్ ఉంది. దర్శకుడు సముతిరఖని ఒరిజినల్ వెర్షన్ లో సోల్ మిస్ కాకుండా చేసుకున్న మార్పులకు అనుగుణంగా మంచి అవుట్ ఫుట్ వచ్చేలా తీస్తానని హామీ ఇచ్చారట. వాస్తవానికి వినోదయ సితం లైన్ బాగుంటుంది. సమస్యల్లో చిక్కుకున్న ఓ మధ్యతరగతి జీవితంలోకి మనిషి రూపంలో టైం వస్తుంది. విధిరాతని స్వంతంగా రాసుకునే ఛాన్స్ ఇస్తుంది. ఆ పాత్రే పవన్ చేస్తోంది. ఆ ఉద్యోగిగా సాయి ధరమ్ తేజ్ కనిపిస్తాడు. తమిళంలో ఇది క్యారెక్టర్ ఆర్టిస్ట్ తంబీరామయ్య చేశారు. ఇక్కడ హీరోయిన్ ని జోడించారు.
మామా అల్లుడు కలిసి వచ్చి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తర్వాత తమన్ ముచ్చటగా మూడోసారి పవన్ కి సంగీతం అందిస్తుండగా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేసవిలోనే విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. దీని కోసమే హరిహరవీరమల్లుకి బ్రేక్ వేయడంతో పాటు తన హెయిర్ స్టైల్ ని పవన్ కళ్యాణ్ మార్చుకున్నారు. కొంత గోపాల గోపాలలో చేసిన కృష్ణుడి క్యారెక్టర్ కి దగ్గరగా ఉన్నా కాన్సెప్ట్ పరంగా వినోదయ సితం ఆసక్తికరంగా సాగుతుంది. తెలుగు టైటిల్ ని ఇంకా ఖరారు చేయలేదు.
This post was last modified on %s = human-readable time difference 10:42 am
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
రాజకీయాల్లో తప్పొప్పులు అనేవి ఉండవు. నేడు తాను చేసింది రైట్ అనిపించిన నాయకుడికి… తదుపరి అదే పనిని తన ప్రత్యర్థి…
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…