చరణ్ అడుగులెటు వైపు ?

రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా విషయంలో క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఆ సినిమా తర్వాత చరణ్ చేయబోయే సినిమా మీద ఇప్పుడు అందరికీ డౌట్స్ నెలకొంటున్నాయి. శంకర్ తో చేస్తున్న RC15 సినిమా తర్వాత చరణ్ బుచ్చి బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా తర్వాత చరణ్ ఇద్దరు దర్శకులకి కమిట్ మెంట్ ఇచ్చాడు. అందులో ఒకరు సుకుమార్. మరొకరు కన్నడ డైరెక్టర్ నర్తన్.

సుకుమార్ తో ‘రంగస్థలం’ చేసి నటుడిగా ఎంతో ఎదిగిన చరణ్ ‘పుష్ప2 ‘ తర్వాత తనతోనే సినిమా చేయాలని సుక్కు కి రిక్వెస్ట్ పెట్టాడు. సుకుమార్ కూడా చరణ్ సినిమా కోసం కథ సిద్దం చేసి పెట్టేశాడు. పుష్ప2 ఘాట్ గ్యాప్ లో చరణ్ సినిమా మీద వర్క్ చేసుకుంటున్నాడు. నర్తన్ కూడా చరణ్ సినిమా స్క్రిప్ట్ పనిలోనే ఉన్నాడు. ఇప్పటికే ఓ లైన్ ఓకే చేయించుకొని దాని మీద వర్క్ చేస్తున్నాడు. ఈ కాంబో సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది.

ఇటు సుకుమార్ అటు నర్తన్ ఈ ఇద్దరిలో చరణ్ ముందుగా చేయబోయే సినిమాపై ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ నడుస్తుంది. మెగా ఫ్యాన్స్ మాత్రం నర్తన్ ప్రాజెక్ట్ కంటే సుకుమార్ సినిమా మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే రాజమౌళి ఈ కాంబో సినిమా ఇంట్రో సీక్వెన్స్ గురించి గొప్పగా చెప్పడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. రంగస్థలం తర్వాత ఆ కాంబోలో రాబోతున్న సినిమాపై మూవీ లవర్స్ లో కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. బిజినెస్ పరంగానూ ఈ ప్రాజెక్ట్ కే క్రేజ్ ఉంటుంది.

ప్రస్తుతం చరణ్ శంకర్ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత బుచ్చి బాబు సినిమా. ఇక సుకుమార్ కూడా పుష్ప 2 ని చెక్కుతున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యే లోపు లెక్కలు మరతాయెమో చెప్పలేం.