మహేష్ కి రాజమౌళి డెడ్ లైన్

రాజమౌళితో సినిమా అంటే ఆ హీరో డైరీలో రెండేళ్ళు పోయినట్టే. ఒక్కో సారి మూడేళ్లు కూడా పట్టోచ్చు. అందుకే మహేష్ తన డైరీను జక్కన్న చేతిలో పెట్టేశాడు. రాజమౌళి సినిమా కోసం తన ఫుల్ టైమ్ కేటాయించబోతున్నాడు మహేష్. అందుకోసమే జెట్ స్పీడులో త్రివిక్రమ్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.

మహేష్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టేసి ఫినిషింగ్ కి తీసుకొచ్చే ప్రాసెస్ లో ఉన్నాడు రాజమౌళి. తండ్రి తో కలిసి యాక్షన్ ఎడ్వెంచర్ కథ సిద్దం చేస్తున్నాడు. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ పై ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాడట. తను పూర్తి స్క్రిప్ట్ తో వచ్చే లోపు ssmb28 ఘాట్ పూర్తి చేయాలని మహేష్ కి ఓ డెడ్ లైన్ పెట్టేశాడట జక్కన్న. తాజాగా ఓ షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్, త్రివిక్రమ్ ఈ నెలాఖరు నుండి మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు. షూటింగ్ పూర్తయిన వెంటనే లుక్ కోసం మహేష్ కి రెండు నెలలు టైమ్ ఇవ్వబోతున్నాడు రాజమౌళి.

మహేష్ రాజమౌళి సినిమా కోసం ఓ కొత్త లుక్ ట్రై చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇంకాస్త హ్యాండ్సప్ గా కనిపించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ ప్రాజెక్ట్ ను ఏడాది చివర్లో షూటింగ్ మొదలు పెట్టి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు జక్కన్న. కానీ అలా అనుకున్న టైమ్ కి కంప్లీట్ అయితే అది రాజమౌళి సినిమా ఎందుకవుతుంది ?