Movie News

రిషబ్‌ను దాటి అవార్డు వస్తుందా?

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డుకు బలమైన పోటీదారు కాబోతున్నాడని.. అతను అవార్డు గెలిచేసినా ఆశ్చర్యం లేదని మీడియా, సోషల్ మీడియా ఇటీవల బాగా హడావుడి జరిగింది. తీరా చూస్తే.. అవార్డు గెలవడం సంగతి అటుంచితే నామినేషన్ కూడా సంపాదించలేకపోయాడు తారక్.

ఇక తారక్ అభిమానుల దృష్టి జాతీయ అవార్డుల మీద పడింది. గత సంవత్సరానికి గాను త్వరలోనే జాతీయ అవార్డులను ప్రకటించే అవకాశాలున్నాయి. కొమరం భీముడో పాటలో అద్భుత అభినయం ఒక్కటి చాలు తారక్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు రావడానికి అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. కానీ ఇక్కడ కూడా తారక్‌కు అవార్డు గ్యారెంటీ అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే తారక్‌కు అడ్డుగా కన్నడ నటుడు రిషబ్ శెట్టి కనిపిస్తున్నాడు.

తాజాగా ‘కాంతార’లో అద్భుత నటనకు గాను మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా ముంబయిలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును రిషబ్ శెట్టి సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ క్రిటిక్స్ కొందరు.. రిషబ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గత ఏడాదికి సంబంధించి ఉత్తమ నటుడిగా ఏ అవార్డు అయినా రిషబ్‌కే చెందాలని అంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి అక్కడి వారిలో ఒకింత అక్కసు కూడా ఉన్న మాట వాస్తవం. ‘బాహుబలి’ని నెత్తిన పెట్టుకున్నట్లు వాళ్లు ‘ఆర్ఆర్ఆర్’ను పెట్టుకోలేదు. ఇక ఈ సినిమాను కేంద్ర ప్రభుత్వం సైతం ఆస్కార్ అవార్డులకు ప్రతిపాదించలేదు.

ఈ నేపథ్యంలో జాతీయ అవార్డుల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’కు ప్రాధాన్యం దక్కుతుందా లేదా అన్నది సందేహంగా మారింది. ‘కాంతార’లో రిషబ్ పెర్ఫామెన్స్‌ను ఒక అద్భుతం అనే చెప్పాలి. ఆ నటనకు సర్ప్రైజ్ కాని వారు లేరు. తారక్ కూడా ‘ఆర్ఆర్ఆర్’లో గొప్పగా నటించినా.. ప్రేక్షకులకు పెద్ద షాకిచ్చిన రిషబ్‌కే జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును కట్టబెట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on February 21, 2023 8:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జాక్ మిస్సవుతున్న కిక్స్ ఇవే

టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…

4 hours ago

బాబు ఔదార్యం చూసి చ‌లించిపోయా: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. బాబు ఔదార్యం…

4 hours ago

బాలికపై 23 మంది మృగాళ్లు…7 రోజుల కీచకపర్వం

దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…

4 hours ago

“ఆమె నటిస్తేనే సినిమా… లేదంటే లేదు”

కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్‌గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…

4 hours ago

ట్రంప్ చర్యలకు బాబు బాధ్యుడా జగన్?

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…

5 hours ago

ఇది నిజం!… పవన్ విద్యార్థులకు అడ్డమే రాలేదు!

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…

5 hours ago