Movie News

బన్నీని వేధిస్తున్న దర్శకుల కొరత

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మనసంతా ఇప్పుడు పుష్ప 2 ది రూల్ మీదే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తనకొచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని ఏ మాత్రం తగ్గేదేలే అనే స్థాయిలో ప్రతి విషయంలో విపరీతమైన జాగ్రత్త తీసుకుంటున్నాడు. దానికి తగ్గట్టే దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ ని పదే పదే చెక్కి ఫైనల్ గా బెస్ట్ అనిపించే వెర్షన్ ని రాసుకున్నారని ఇప్పటికే టాక్ ఉంది. ఒకవేళ హిందీ వెర్షన్ కనక ఫ్లాప్ అయ్యుంటే ఇప్పుడీ సీక్వెల్ ప్రహసనం ఇంకోలా ఉండేది. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసేవాళ్ళు. నార్త్ లో బ్లాక్ బస్టర్ కావడమే రెండో భాగం మీద అంచనాలు పెంచింది.

దీని సంగతి కాసేపు పక్కన పెడితే పుష్ప 2 తర్వాత ఏ దర్శకుడితో చేయాలనే దాని మీద బన్నీ చాలా ఒత్తిడిలో ఉన్నట్టు అల్లు వర్గాల సమాచారం. ఎందుకంటే తన రేంజ్ లో సరితూగగల స్టార్ డైరెక్టర్లందరూ బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ సలార్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఫిక్స్ చేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగ యానిమల్ తర్వాత ఇంకో రెండేళ్లు స్పిరిట్ కోసం ఖర్చు పెడతాడు. సుకుమార్ తో ఇప్పుడప్పుడే కాంబో రిపీట్ చేసే ఛాన్స్ లేదు. శంకర్ చరణ్ 15, ఇండియన్ 2 తర్వాత రణ్వీర్ సింగ్ కు కమిటయ్యాడు. రాజమౌళి ఇంకో మూడేళ్ళ దాకా నో ఛాన్స్.

పోనీ వాల్తేరు వీరయ్యతో భారీ విజయం అందుకున్న బాబీకి ఛాన్స్ ఇద్దామా అంటే రిస్క్ ఎక్కువ. రొటీన్ కమర్షియల్ ఫ్లేవర్ ని తప్ప అందరినీ మెప్పించేలా తీయలేడు. మురుగదాస్, లింగుస్వామి లాంటి వాళ్ళు అవుట్ అఫ్ ఫామ్ లో ఉన్నారు. బోయపాటి శీను రామ్ తర్వాత అఖండ 2 పనులను మొదలుపెట్టాలి. వంశీ పైడిపల్లి ఇప్పుడప్పుడే విజయ్ ని వదిలి వచ్చేలా లేడు. ఇన్ని ఆప్షన్లు చూసినా ఏదీ అనుకూలంగా లేకపోవడమే ఐకాన్ స్టార్ అసలు సమస్య. ఏది ఎలా ఉన్నా పుష్ప 2 పోస్ట్ ప్రొడక్షన్ వెళ్లేలోపే నెక్స్ట్ ప్రాజెక్టు లాక్ చేసుకోవాలి. లేదంటే గ్యాప్ వచ్చేస్తుంది

This post was last modified on February 21, 2023 3:29 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

50 minutes ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

3 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

4 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

4 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

5 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

5 hours ago