మాములుగా హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలంటే మన దేశంలోనూ పిచ్చ క్రేజు. ఉదయం బెనిఫిట్ షోలు వేసినా హౌస్ ఫుల్ అయ్యే రేంజ్ లో ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ మధ్య బ్లాక్ పాంథర్ వాకండ ఫరెవర్ కు వారం రోజులు నగరాల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇక అవెంజర్స్, స్పైడర్ మ్యాన్, డార్క్ నైట్, లయన్ కింగ్ లాంటివి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అంతెందుకు అవతార్ 2 వే అఫ్ వాటర్ నెలరోజులు దాటినా ఇప్పటికీ మెయిన్ సెంటర్స్ లో ఆడుతూనే ఉంది. అందుకే ఇలాంటివి వచ్చిన ప్రతిసారి పోటీ గురించి మనవాళ్ళు టెన్షన్ పడుతుంటారు.
మొన్న శుక్రవారం యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్యాంటమేనియా రిలీజయ్యింది. ఈ సిరీస్ కి భారీ ఫాలోయింగ్ ఉంది. సహజంగానే అంచనాలు ఆకాశానికెళ్ళాయి. తీరా చూస్తే మార్వెల్ నుంచి వచ్చిన అత్యంత బ్యాడ్ ఫిలిమ్స్ లో ఇదీ ఒకటని ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. దానికి తగ్గట్టే వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో లేవు. ఫైనల్ రన్ అయ్యేలోగా మహా అయితే యాభై కోట్లు దాటడం గగనమే అంటున్నారు బయ్యర్లు. అసలు వీకెండ్ ని సైతం వాడుకోలేక చీమ మనిషి చేతులు ఎత్తేశాడు. బిసి సెంటర్స్ లో సగం హాళ్లు కూడా నిండలేక ఎగ్జిబిటర్లు డీలా పడ్డారు.
మొత్తానికి యాంట్ మ్యాన్ 3 ఫ్లాప్ క్యాటగిరీలో చేరిపోయింది. కేవలం హంగులు, హడావిడి, గ్రాఫిక్స్ తప్ప కంటెంట్ మీద దృష్టి పెట్టలేకపోతున్న దర్శక నిర్మాతలు దానికి తగ్గ ఫలితాలనే అందుకుంటున్నారు. ఎండ్ క్రెడిట్స్ తర్వాత వచ్చే స్పెషల్ సీన్స్ మీద పెడుతున్న శ్రద్ధ అసలు కథా కథనాల మీద చూపించడం లేదు. దాంతో జనానికి వీళ్ళు చెప్పే నస నచ్చడం లేదు. అటు ఓవర్సీస్ లోనూ దీని పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. రివ్యూలు చాలా మటుకు నెగటివ్ గానే వచ్చాయి. మహా అయితే ఇంకో వారం పదిరోజులు తప్ప వాషౌట్ కు దగ్గరలో ఉంది యాంట్ మ్యాన్.
This post was last modified on February 20, 2023 12:06 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…