Mrunal Thakur
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆలస్యం చేయకుండా ఒక సినిమా లాగించేయాలని తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో జట్టు కట్టాడు రామ్ చరణ్. పక్కా ప్లానింగ్‌తోనే రంగంలోకి దిగాడు కానీ.. ఆ ప్లాన్ కొన్ని కారణాల వల్ల అనుకున్నట్లుగా అమలు కాలేదు. శంకర్‌కు అనుకోకుండా ఇండియన్-2 కమిట్మెంట్ పడడం వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతోంది. దీని వల్ల చరణ్ సినిమా ఆగి ఆగి నడుస్తోంది.
ఈలోపు మెగా పవర్ స్టార్.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కథానాయిక ఖరారైపోయింది. సీతారామం సినిమాలో సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్.. ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం.
సీతారామం తర్వాత తెలుగు నుంచి చాలామంది సంప్రదించినా.. సినిమాల ఎంపికలో మృణాల్ తొందరపడలేదు. టైం తీసుకుని నాని కొత్త సినిమా మాత్రమే ఒప్పుకుంది. ఆ తర్వాత ఆమె ఓకే చేసింది రామ్ చరణ్-బుచ్చిబాబు చిత్రాన్ని మాత్రమే. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ తిరుగులేని ఇమేజ్ సంపాదించడంతో ఇక అతడి సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కనున్నాయి. బుచ్చిబాబు సినిమా కూడా అంతే. ఇలాంటి భారీ చిత్రంలో నటిస్తే కెరీర్‌కు చాలా ప్లస్ అవుతుందని మృణాల్ వెంటనే ఈ చిత్రాన్ని ఓకే చేసినట్లు తెలుస్తోంది.
చరణ్-మృణాల్ జోడీ చూడముచ్చటగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు అనే కొత్త నిర్మాత వృద్ధి సినిమాస్ బేనర్ మీద నిర్మించనున్నారు. మిగతా కాస్ట్ అండ్ క్రూ అంతటినీ సెట్ చేసుకుని ఈ వేసవిలో సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాలని బుచ్చిబాబు అండ్ టీం ప్రణాళికలు రచిస్తోంది.
This post was last modified on February 20, 2023 6:21 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…