గత ఏడాది ‘ఖుషి’ సినిమా షూటింగ్ చాలా ఉత్సాహంగా మొదలుపెట్టి.. చకచకా కొన్ని షెడ్యూళ్లు లాగించేసింది చిత్ర బృందం. చూస్తుండగానే 60 శాతం చిత్రీకరణ పూర్తయిపోయింది. కానీ ఇంతలో హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ రిలీజ్ ప్రమోషన్ల కోసం పక్కకు వెళ్లాడు. అతను తిరిగొచ్చేసరికి హీరోయిన్ సమంత అనారోగ్యం బారిన పడింది. ఇక అంతే.. షెడ్యూళ్లు క్యాన్సిల్ చేసుకుని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంది చిత్ర బృందం.
ఇదిగో అదిగో అనుకుంటూనే నెలలు నెలలు గడిచిపోయాయి. సినిమా రిలీజ్ కూడా నిరవధికంగా వాయిదా పడిపోయింది. సమంత అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి షూటింగ్‌కు హాజరయ్యే స్థితిలో ఉన్నా ‘ఖుషి’ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టలేదు. ముందు హిందీ వెబ్ సిరీస్ షూట్‌కే హాజరైంది. దీంతో ‘ఖుషి’ మీద నీలినీడలు కమ్ముకున్నాయి.
ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్లు, ముఖ్యంగా విజయ్ అభిమానులు నిరాశలో పడిపోయారు. ఐతే తాజా సమాచారం ప్రకారం సమంత అతి త్వరలోనే ‘ఖుషి’ షూట్‌కు హాజరు కానుందని సమాచారం. సమంత అనారోగ్యం నుంచి కోలుకున్నాక వెంటనే ‘ఖుషి’ షూటింగ్‌కు రాకపోవడానికి వేరే కారణం కూడా ఉన్నట్లు సమాచారం. ఇది పూర్తి స్థాయి ప్రేమకథ. ఇందులో హీరో హీరోయిన్ల లుక్స్ చాలా కీలకం. కథానాయిక అందంగా, మంచి ఫీల్‌తో కనిపించాలి.
ఐతే మయోసైటిస్ నుంచి కోలుకున్నప్పటికీ.. సమంత ముఖంలో నీరసం పోలేదు. చాలా డల్లుగా, అలసటగా కనిపించింది. ఆ లుక్‌తో ‘ఖుషి’ షూట్‌కు హాజరైతే సినిమా ఫీల్ దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో సమంత ఆగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె వర్కవుట్లతో పాటు థెరపీలు కూడా చేయించుకుంటున్నట్లు సమాచారం. మునుపటిలా ఆకర్షణీయంగా మారాక, ముఖంలో కళ వచ్చాక ‘ఖుషి’ షూటింగ్‌కు ఆమె హాజరు కానుందట. అది కొన్ని రోజుల్లోనే సాధ్యమవుతుందని.. మార్చి ఆరంభంలోనే ‘ఖుషి’ తిరిగి పట్టాలెక్కుతుందని అంటున్నారు.
This post was last modified on February 18, 2023 10:28 pm
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…