Movie News

తండ్రీ కొడుకుల యుద్ధం రానా నాయుడు

దగ్గుబాటి అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న రానా నాయుడు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ముంబైలో జరిగిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హైదరాబాద్ నుంచి తెలుగు మీడియాని ఆహ్వానించి మరీ తమ ప్రత్యేకత చూపుకుంది నిర్మాణ బృందం. ఒక పెద్ద సినిమాకయ్యేంత ఖర్చు దీనికి పెట్టారని టీజర్ నుంచే ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది. వెంకటేష్ రానాల తొలి ఫుల్ లెన్త్ కలయిక కావడంతో ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. దానికి తగ్గట్టే వీడియోని కట్ చేశారు

సినీ పరిశ్రమలోనే కాదు ఏ సెలబ్రిటీకి ఎలాంటి సమస్య వచ్చినా అందరికీ గుర్తొచ్చే పేరు రానా(రానా). తనను నమ్మి కాంట్రాక్టు ఇచ్చిన వాళ్ళ కోసం ఎంత రిస్క్ అయినా సరే చేసేందుకు సిద్ధపడతాడు. ఈ క్రమంలో నేరాలతో నిండి ఉన్న చీకటి ప్రపంచంలో పెద్ద గుర్తింపు తెచ్చుకుంటాడు. అంతా బాగుందనుకుంటున్న టైంలో ఏళ్ళ తరబడి జైలు శిక్ష అనుభవించిన నాగా(వెంకటేష్) బయటికి వస్తాడు. అతనెవరో కాదు స్వయానా రానా తండ్రి. కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. విపరీతమైన ద్వేషంతో రగిలిపోయే రానా ఏం చేశాడనేది అసలు స్టోరీ.

కథేంటో స్పష్టంగా చెప్పేశారు. విజువల్స్ అన్నీ బాలీవుడ్ స్టాండర్డ్ లో ఉన్నాయి. ఇది హిందీలో తీసిన వెర్షన్. తెలుగులో డబ్బింగ్ చేశారని లిప్ సింక్ చూస్తే అర్థమైపోతుంది. జాన్ స్టీవర్ట్ ఏడూరి సంగీతం సమకూర్చగా మొత్తం నలుగురు రచయితలు ఈ స్క్రిప్ట్ మీద పని చేశారు. కరణ్ అంశుమన్ – సుపర్న్ ఎస్ వర్మ టేకింగ్ ఆసక్తికరంగా సాగింది. ఏ మార్కు సీన్లు జోకులు కుడా ఉన్నాయి. వెంకీ మామని ఇంత హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో చూసి చాలా కాలమయ్యింది. పైగా నెగటివ్ షేడ్స్ కూడా జోడించడంతో క్యారెక్టరైజేషన్ ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి బాబాయ్ అబ్బాయ్ లు ఏదో గట్టి ప్లాన్ తోనే వస్తున్నారు.

This post was last modified on February 15, 2023 10:54 pm

Share

Recent Posts

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

34 minutes ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

38 minutes ago

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

2 hours ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

2 hours ago

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…

2 hours ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

4 hours ago