‘సార్’ సినిమా కంటే ముందే దనుష్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు శేఖర్ కమ్ముల. ఎనౌన్స్ మెంట్ నుండే అందరిలో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా కంటే ముందే ధనుష్ సితార తో కమిట్ అయ్యాడు. అది అయ్యాకే శేఖర్ కమ్ముల సినిమా చేయాల్సి ఉంది.
అందుకే ఇన్ని నెలలు ధనుష్ కోసం వెయిట్ చేశాడు కమ్ముల. అయితే సార్ షూటింగ్ పూర్తయిన రెండు మూడు నెలలు దాటింది. పోస్ట్ ప్రొడక్షన్ ఫినిషింగ్ లో ఉంది. ఇదే నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కానీ ఇంత వరకూ ధనుష్ -శేఖర్ కమ్ముల సినిమా సెట్స్ పైకి వెళ్ళకపోవడమే డౌట్ వచ్చేలా చేస్తుంది. నిజానికి ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ధనుష్ అంత హ్యాపీ గా లేడని ఓ టాక్ వచ్చింది. అందుకే శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ కి రిపేర్లు చేస్తున్నారని అనుకున్నారు.
లవ్ స్టోరీ కూడా శేఖర్ కమ్ముల కి పెద్ద హిట్ ఇవ్వలేదు. జస్ట్ పాస్ మార్కులతో కొంత కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. ఈసారి ధనుష్ తో చేయబోయే సినిమాతో ఇటు తెలుగు అటు తమిళ్ లో గట్టి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. బహుశా అందుకే ఇంత గ్యాప్ తీసుకుంటూ కథను ఇంకా చెక్కుతున్నట్టున్నాడు.
ఏదేమైనా శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. ఇకపై అయినా సెట్స్ పైకి వస్తే ఆయన సినిమాలను ఇష్టపడే వారు సంతోష పడతారు. లేదంటే కమ్ముల కి ఈ గ్యాపేంటీ ? అంటూ డిస్కషన్ పెట్టుకుంటారు.
This post was last modified on February 12, 2023 10:40 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…