Movie News

కిరణ్ అబ్బవరం బెండు తీసేస్తున్నారు

ప్రమోషన్ల పేరుతో మరీ అతి చేస్తే.. అసంబద్ధమైన ఆలోచనల్ని జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తే ఎలా బూమరాంగ్ అవుతుందో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ హీరో కిరణ్ అబ్బవరం ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఇప్పుడు. ఈ సినిమా ట్రైలర్ చూసిన వారిని కాన్సెప్ట్ బాగానే ఆకర్షించింది. మన ఇళ్లకు అటు ఇటు ఉన్న వాళ్లను నెయ్‌బర్స్ అన్నట్లే.. మన ఫోన్ నంబర్‌కు ఇటు ఇటు ఉన్న వాళ్లను కూడా ఫోన్ నంబర్ నెయ్‌బర్స్ అనొచ్చని.. వాళ్లతో పరిచయం జరిగి స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

ఐతే సినిమాలో ఈ కాన్సెప్ట్ ఓకే కానీ.. నిజ జీవితంలో ఇలా ఫోన్ నంబర్ నెయ్‌బర్స్‌తో స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో ప్రమోషన్లు మొదలుపెట్టాడు కిరణ్ అబ్బవరం. ఈ విషయాన్ని జనాలకు చేరవేసే విషయంలో అతను కొంచెం అతిగానే మాట్లాడాడు. మన పక్క ఫోన్ నంబర్లు ఉన్న వాళ్లు కూడా మనకు సాయం చేయొచ్చని.. కాబట్టి వాళ్లకు ఫోన్ చేసి స్నేహం చేయండని అతను పిలుపునిచ్చాడు. అంతా చెప్పి చివర్లో దీన్ని చెడుకు వాడొద్దని కూడా అన్నాడు.

కానీ ఈ అప్పీల్ అల్లరి కుర్రాళ్లకు మంచి వ్యాపకంగా మారినట్లుంది. ఇటు అటు నంబర్లకు ఫోన్ చేయడం.. అందులో అమ్మాయిలు ఉంటే వారిని ఫ్రెండ్షిప్ పేరుతో వేధించడం లాంటివి చేస్తున్నట్లున్నారు. దీంతో అలా ఇబ్బంది ఎదుర్కొన్న అమ్మాయిలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఏంటీ నాన్సెన్స్ అని. కొందరు అబ్బాయిలు కూడా ఇదేం నస అంటూ చిరాకు పడుతున్నారు.

మొత్తంగా చూస్తే ఈ కాన్సెప్ట్ బూమరాంగ్ అయినట్లే ఉంది. కిరణ్‌ మీద మండిపడుతూ.. ఈ చెత్త కాన్సెప్ట్ ప్రమోషన్లను కట్టి పెట్టాలని.. వెంటనే ఆ పోస్టును డెలీట్ చేయాలని అతడి మీద మండి పడుతున్నారు. రోజు రోజుకూ కిరణ్ మీద విమర్శలు పెరుగుతున్నాయి. చివరికి ఈ ప్రమోషన్ బూమరాంగ్ అయి సినిమాకు చేటు చేస్తుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on February 11, 2023 2:26 pm

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

30 minutes ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

3 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

3 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

6 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

7 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

8 hours ago