కొన్ని కథలు ఒక హీరో దగ్గరికి వెళ్లి, ఫైనల్ గా మరో హీరో చేతికి చిక్కుతాయి. రెండేళ్ల క్రితం థియేటర్స్ లోకి సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన రవితేజ బ్లాక్ బస్టర్ ‘క్రాక్’ వెనుక కూడా మరో హీరో ఉన్నాడు. ఆయనే బాలయ్య. అవును గోపీచంద్ మలినేని ముందుగా క్రాక్ కథను బాలయ్యతోనే చేయాలని అనుకున్నాడట. సి. కళ్యాణ్ నిర్మాణంలో ప్రాజెక్ట్ అనుకొని ఫైనల్ గా ఆ టైమ్ లో బాలయ్య బిజీగా ఉండటం వల్ల రవితేజకి చెప్పి సినిమా లాక్ చేసుకున్నాడట. ఇక హీరోతో పాటు నిర్మాత కూడా మారాడు.
‘క్రాక్’ కథ ముందు బాలయ్య తో అనుకున్నామని గోపీచంద్ ఎక్కడా చెప్పింది లేదు. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత సి. కళ్యాణ్ బయటపెట్టాడు. కళ్యాణ్ నిర్మించిన ఓ సినిమా ఫంక్షన్ కి గెస్ట్ గా వచ్చాడు గోపీచంద్ మలినేని. గోపి గురించి కళ్యాణ్ మాట్లాడుతూ మా కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ రావాల్సి ఉంది. కానీ ఎందుకో కుదర్లేదని చెప్పుకున్నాడు. మొన్న సంక్రాంతికి బాలయ్యతో గోపీచంద్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ కాంబో సినిమా నేను చేయాల్సింది. కానీ అది మరొకరికి రాసి పెట్టి ఉంది.
బాలయ్య తో ఆ టైమ్ లో క్రాక్ కథ అనుకున్నాం. కానీ అప్పుడు బాలయ్య డేట్స్ కుదరకపోవడం మరో ప్రాజెక్ట్ తో బిజీ గా ఉండటం చేత ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. అలా బ్లాక్ బస్టర్ క్రాక్ సినిమాను నేను మిస్సయ్యానని చెప్పాడు కళ్యాణ్. గోపీచంద్ మలినేని బాలయ్యతో క్రాక్ అనుకొని ఇప్పుడు వీర సింహా రెడ్డితో ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ రకంగా బాలయ్య క్రాక్ మిస్ అయ్యాడు. అయినా ఆ సినిమాతో రవితేజ మళ్ళీ కం బ్యాక్ ఇవ్వాలని రాసి ఉన్నప్పుడు బాలయ్య ఎలా చేస్తాడు ? ఈ విషయంలో అదే జరిగిందనుకోవచ్చు.
This post was last modified on February 10, 2023 7:46 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…