రామ్ చరణ్ ‘ఉద్యమం’

శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న RC15 సినిమా గురించి బయట చాలానే లీకులు ఉన్నాయి. సినిమా ఘాట్ అల్మోస్ట్ అవుట్ డోర్ లోనే జరుగుతుండటంతో ఇప్పటికే చాలా ఫోటోలు , వీడియోస్ లీకయ్యాయి. అయితే సినిమా కంటెంట్ కూడా లీకవుతూ వస్తుంది. ఈ సినిమాలో చరణ్ ను ఓ రాజకీయ నాయకుడిగా చూపిస్తున్నాడట శంకర్.

ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ పార్టీ పెట్టడం, ఉద్యమం చేయడం లాంటివి ఉంటాయట. శ్రీకాంత్ ఇందులో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. అతని కొడుకు పాత్రలో ఎస్ జె సూర్య కనిపించనున్నాడు. చరణ్ తో శంకర్ పక్కా పొలిటికల్ డ్రామా తీయనున్నాడన్నమాట. ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ సరికొత్తగా కనిపించనున్నాడని లీకైనా ఫోటోలో చూస్తే తెలుస్తుంది. ఇప్పటి వరకు చరణ్ ను చూడని విదంగా శంకర్ ప్రెజెంట్ చేస్తున్నాడు.

చరణ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. తండ్రి , కొడుకులుగా నటిస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్రతో చరణ్ నటుడిగా మరింత ఉన్న స్థాయికి చేరుకోవడం పక్కా అని ఇన్సైడ్ టాక్. పొలిటికల్ స్పీచ్ లతో అదరగొడతాడని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఎలక్షన్స్ వేడిలో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నడు దిల్ రాజు. వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ లో సినిమా థియేటర్స్ లోకి రానుంది.