ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో కుర్ర దర్శకులు సత్తా చాటుతున్నారు. వెంకీ అట్లూరి కూడా తనకున్న మూడు సినిమాల ఎక్స్ పీరియన్స్ తో ఓ బై లింగ్వల్ సినిమాను డీల్ చేశాడు. దనుష్ తో తమిళ్ , తెలుగులో సినిమా చేశాడు. వాతి /సార్ ఈ నెల 17 న రిలీజ్ కాబోతుంది. సోషల్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు, తమిళ్ లో సూపర్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు వెంకీ అట్లూరి. వెంకీ తన మూడు సినిమాలో సెకండాఫ్ లండన్ లో ప్లాన్ చేసుకున్నాడు. తొలి ప్రేమ తర్వాత మిగతా రెండు సినిమాళ్లో సెకండాఫ్ తేడా కొట్టింది. ఈసారి సెకండాఫ్ విదేశంలో ఉండదని , ఆ జాగ్రత్త వహించానని తెలిపాడు. అంటే రెండో భాగంపై వెంకీ కాస్త కేర్ తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా సక్సెస్ వెంకీకి చాలా కీలకమనే చెప్పాలి. మొదటి సినిమా ‘తొలి ప్రేమ’ తర్వాత వెంకీ మళ్ళీ సూపర్ హిట్ కొట్టలేదు. ‘మిస్టర్ మజ్ను’ , ‘రంగ్ దే’ సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ఈ క్రమంలో వెంకీ అట్లూరి కి ఓ హిట్ పడాలి. లేదంటే ఈ యంగ్ డైరెక్టర్ కి అవకాశాలు కష్టమవుతాయి. సార్ మీదే వెంకీ ఆశలన్నీ పెట్టుకున్నాడు.
ఈ బై లింగ్వల్ సినిమా కోసం విద్యా వ్యవస్థలో జరిగే అన్యాయాన్ని కథా వస్తువుగా తీసుకున్నాడు. సందేశంతో కూడిన ఈ సినిమాలో ఎంటర్టైన్ మెంట్ కూడా జోడించాడు. పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. మరి వెంకీ ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కోడతాడో చూడాలి.
This post was last modified on February 9, 2023 4:07 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…