జపాన్‌లో ఇండియన్ సినిమాల హవా గురించి మాట్లాడాల్సి వచ్చినపుడల్లా ‘ముత్తు’ గురించే మాట్లాడేవారు చాలా ఏళ్ల పాటు. ఆ చిత్రం 90వ దశకంలోనే 400 మిలియన్ యాన్‌ల వసూళ్లు రాబట్టి సంచలనం రేపింది. జపాన్‌లో హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిలింగా పాతికేళ్లకు పైగా ఆ సినిమా రికార్డులు అలాగే నిలబడి ఉన్నాయి.
ఆ తర్వాత ఇండియన్ మూవీస్ చాలానే జపాన్‌లో రిజలీయ్యాయి కానీ.. ఏదీ ‘ముత్తు’ వసూళ్ల దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. రాజమౌళి సినిమా ‘బాహుబలి’కి అక్కడ మంచి స్పందనే వచ్చినా ‘ముత్తు’ రికార్డును కొట్టలేకపోయింది.
కానీ ఈ సినిమా వేసిన బేస్‌ను రాజమౌళి తర్వాతి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ బాగానే ఉపయోగించుకుంది. బాగా ప్రమోట్ చేసి ఈ చిత్రాన్ని జపనీస్‌లో రిలీజ్ చేయగా.. తొలి రోజు నుంచి భారీ వసూళ్లతో దూసుకెళ్లింది. ఆరంభంలో ఊపు చూస్తేనే ‘ఆర్ఆర్ఆర్’.. ‘ముత్తు’ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని తేలిపోయింది.
అనుకున్నట్లే విడుదలైన రెండో నెలలోనే ‘ముత్తు’ను దాటేసింది ‘ఆర్ఆర్ఆర్’. జపాన్‌లో ఇప్పటికీ సినిమాలకు లాంగ్ రన్ ఉంటోంది. అక్కడ అర్ధశత దినోత్సవాలు, శతదినోత్సవాలు జరుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఇలాగే 50 రోజులు, 100 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది. షిఫ్ట్‌లతో కలిపి వందకు పైగా సెంటర్లలో ఈ చిత్రం శత దినోత్సవం జరుపుకోవడం విశేషం.
విడుదలైన 105వ రోజు తొలి రోజు కంటే ఎక్కువగా ఈ చిత్రానికి వసూళ్లు రావడం ఒక సంచలనం. ఈ క్రమంలోనే సినిమా బిలియన్ యాన్‌ల వసూళ్ల వైపు అడుగులు వేస్తోంది. ‘ముత్తు’ పేరిట ఉన్న 400 మిలియన్ యాన్‌ల రికార్డును కొట్టడాన్నే గొప్పగా చెప్పుకుంటే.. ఇప్పుడు ఏకంగా బిలియన్ యాన్‌ల (వెయ్యి మిలియన్ యాన్‌లు) మైలురాయిని అందుకునే దిశగా సినిమా అడుగులు వేస్తుండడం అనూహ్యం.
సినిమా ఊపు చూస్తుంటే ఇంకొన్ని వారాల పాటు నిలకడగా వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ఏ ఇండియన్ సినిమా కూడా జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులను టచ్ చేసే అవకాశం కనిపించడం లేదు.
This post was last modified on February 9, 2023 3:13 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…