నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత ప్లానింగ్ పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ నుండి ఆమె బాలీవుడ్ వైపు అడుగులేస్తుంది. ప్రస్తుతం కమిట్ అయిన తెలుగు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి త్వరలోనే ముంబై కి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉంది. ఇటీవల ముంబై లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసింది కూడా. అక్కడ సమంత ఫ్లాట్ కొన్న విషయం బయటికి రాగానే తెలుగులో ఇకపై సినిమాల కౌంట్ తగ్గించబోతుందని అందరూ భావిస్తున్నారు.
ఫ్యామిలీ మెన్ సిరీస్ తో బాలీవుడ్ కి బాగా దగ్గరైంది సమంత. తాజాగా అక్కడ మరో సిరీస్ చేస్తుంది. హిందీలో రెండు సినిమాలు సైన్ చేసిందని టాక్ ఉంది. తెలుగులో ఖుషి తర్వాత ఆమె మరో సినిమా కమిట్ అవ్వలేదు. నెక్స్ లైనప్ అంతా హిందీలోనే ఉందనుందని తెలుస్తుంది. అలాగే తమిళ్ లో కూడా రెండు మూడు ప్రాజెక్ట్స్ లైనప్ లో పెట్టుకుందని సమాచారం.
చైతుని పెళ్ళాడి హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలనుకున్న సమంత ఇప్పుడు ముంబై లోనే ఎక్కువ ఉండేలా ప్లాన్ చేసుకుంటుందని ఇన్సైడ్ టాక్. మరి బాలీవుడ్ లో సామ్ బిజీ హీరోయిన్ అవుతుందా ? అనారోగ్యం నుండి ఇప్పుడిప్పుడే కొలుకుంటుంది సామ్. ఇకపై తన కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టబోతుంది. త్వరలోనే ఖుషి షూట్ లో పాల్గొనబోతుంది. సామ్ కోసమే కొన్ని నెలలుగా బ్రేక్ పడిన ఈ సినిమా ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ మొదటి వారం నుండి మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది.
This post was last modified on February 9, 2023 12:24 pm
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…