బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా మైలురాయి అందుకున్న వీరసింహారెడ్డి ఎనభై కోట్లకు పైగా షేర్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పందెంలో మొదటి స్థానం కాకపోయినా ఫలితం పట్ల అభిమానులు సంతోషంగానే ఉన్నారు. అయితే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే దీని షూటింగ్ టైంలో ఫ్యాక్షనిస్టుగా పెద్ద బాలయ్య గెటప్ చూసి ఇది అచ్చం కన్నడ మూవీ మఫ్టీలో శివ రాజ్ కుమార్ లాగే ఉందంటూ కొందరు ఫోటోలతో సహా సాక్ష్యాలు చూపించారు. ఏకంగా దాని రీమేకనే ప్రచారం కూడా జరిగింది. చొక్కా పంచె కలర్లు రెండిట్లో ఒకేలా ఉండటమే దీనికి కారణం. దీనికి క్లారిటీ వచ్చేసింది.
స్వయంగా బాలయ్యే కుండబద్దలు కొట్టారు. నిన్న జరిగిన వేద డబ్బింగ్ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వెళ్లి అందులో భాగంగా శివ రాజ్ కుమార్ తో అనుబంధం గురించి చెబుతూనే మఫ్టీ తనకు చాలా నచ్చిందని వీరసింహారెడ్డి పాత్రను దాన్ని చూసే తీర్చిదిద్దామని స్పష్టంగా చెప్పేశారు. అంటే గతంలో వచ్చిన పోలిక వెనుక కథ ఇదన్న మాట. మఫ్టీ మల్టీ స్టారర్. కెజిఎఫ్ ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం హీరో శ్రీమురళితో పాటు శివరాజ్ కుమార్ నటించారు. అక్కడ ఘనవిజయం సాధించింది. అందులోనూ సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. కానీ స్టోరీపరంగా డిఫరెంట్ స్టైల్ లో సాగుతుంది.
శాండల్ వుడ్ లో ఎంత గొప్ప పేరున్నా శివరాజ్ కుమార్ తెలుగులో స్ట్రెయిట్ మూవీ ఎప్పుడూ చేయలేదు. కేవలం బాలయ్య అడిగారన్న కారణంగా గౌతమీపుత్ర శాతకర్ణిలో బుర్రకథకుడిగా ఓ పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. చాలాసార్లు పలు వేడుకల్లో బెంగళూరులో ఇద్దరూ కలుసుకున్న దాఖలాలున్నాయి. అంత బాండింగ్ ఉంది కాబట్టి మఫ్టీని స్ఫూర్తిగా తీసుకుని వీరసింహారెడ్డిని డిజైన్ చేశామని చెప్పడానికి బాలయ్య మొహమాటపడలేదు. నిజానికి ఆ కన్నడ సినిమాని ఇక్కడ రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి కానీ కాంబో కుదరక మనోళ్లు లైట్ తీసుకున్నారు.
This post was last modified on February 8, 2023 1:02 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…