తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేల సంఖ్య వైసీపీలో పెరిగిపోతోంది. ఇటీవలే నెల్లూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు రోడ్డున పడ్డారు. ఇక, ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా రెడీగా ఉన్నారనేవాదన పార్టీలోనే వినిపిస్తుండడం గమనార్హం. ఉమ్మడి కృష్నాజిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో తొలిసారి పాగా వేసిన వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య వర్గపోరు తాజాగా మరోసారి రచ్చకెక్కింది.
వైసీపీ జిల్లా ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ దగ్గరకు మైలవరం పంచాయితీ చేరింది. గుంటూరులోని రాజశేఖర్ ఆఫీస్‌లో నేతలను కూర్చోబెట్టి పంచాయతీ చేయాలని మర్రి భావించారు. అయితే.. ఈ క్రమంలో రగడ పెద్దదై.. వైసీపీ నేతలు గొడవపడ్డారని తెలిసింది. మైలవరం నేతలను ఎమ్మెల్యే వసంత.. మర్రి రాజశేఖర్ దగ్గరకు పంపారు. ఎమ్మెల్యేపై మంత్రి రమేష్ అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని నేతలు ఆరోపించారు.
అయితే.. మంత్రి జోగి రమేష్ తరఫున మర్రి వద్దకు వచ్చిన నాయకులు తమ నేతపై ఎమ్మెల్యే వసంత చేసిన ఆరోపణలను వారు ఖండించారు. మర్రి రాజశేఖర్ ఎదుటే బాహాబాహీకి దిగారు. దీంతో ఈ పంచాయతీ ఇక ఇప్పట్లో తెగేది కాదని అంటున్నారు. ఇక, ఎమ్మెల్యే విషయానికి వస్తే.. వసంత కొన్నాళ్లుగా పార్టీపై గుస్సాగానే ఉన్నారు. గుంటూరులో జరిగిన తొక్కిస లాట ఘటనలో ఎన్నారై ఉయ్యురు శ్రీనివాస రావును పోలీసులు అరెస్టు చేయడం(తర్వాత బెయిల్ వచ్చింది) తగదని మీడియా ముఖంగానే చెప్పారు.
అంతేకాదు.. అమరావతిని ఎలా నూ పోగొట్టుకున్నామని.. ఇప్పుడు సాయం చేసే ఎన్నారైలను కూడా పోగొట్టుకుంటే.. ఎలా అని కూడా ఆయన స్పందించారు. ఈ పరిణామాలను పార్టీ అదిష్టానం తీవ్రంగానే భావిస్తోంది. దీంతో ప్రస్తుతానికి పొమ్మన కుండా.. పొగ పెట్టిన చందంగా వ్యవహరిస్తోందని అంటున్నారు పరిశీలకులు. దీంతో వసంత కూడా త్వరలోనే తన దారి తాను చూసుకునేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 8, 2023 11:32 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…