అగ్ర దర్శకులు మాములుగా ఎంత ఒత్తిడిలో ఉంటారో చూస్తుంటాం. అందుకే రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి వాళ్ళు ఒక సమయంలో ఒక పని మీదే ఉంటారు. కానీ సుకుమార్ మాత్రం దీనికి భిన్నంగా ఒకపక్క పుష్ప లాంటి ప్యాన్ ఇండియాలు చేస్తూనే మరోపక్క కుర్ర హీరోలతో తక్కువ బడ్జెట్ సినిమాలకు కథలు డైలాగులు అందిస్తూ తన కలానికి విపరీతమైన పని పెట్టేస్తున్నారు. నిన్న ప్రకటించిన సిద్దు జొన్నలగడ్డ కొత్త మూవీకి రచన సుక్కు అని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఏడాదికి పైగా పుష్ప 2 మీద పని చేస్తున్న ఈయనకు అంత తీరిక ఎక్కడ దొరికిందబ్బా అనే సందేహం వచ్చింది.
మొన్న డిసెంబర్ లో రిలీజైన నిఖిల్ 18 పేజెస్ కు పెన్ను సపోర్ట్ సుకుమార్ దే. ఇది ఇప్పుడు మొదలుపెట్టిన ట్రెండ్ కాదు. రాజ్ తరుణ్ కుమారి 21 ఎఫ్ అంత విజయం సాధించడంలో ఈయన మార్క్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డైరెక్షన్ చేసింది శిష్యుడే అయినా తన ముద్ర కూడా ఉండేలా చూసుకోవడంతో పెద్ద హిట్టు కొట్టింది. ఆడలేదు కానీ దర్శకుడు అనే చిన్న సినిమా నిర్మాణం వెనుక ఉన్నది సుకుమార్. త్వరలో విడుదల కాబోతున్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్షకు స్క్రిప్ట్ చేసి ఇచ్చింది ఈ క్రియేటివ్ డైరెక్టరే. తన బృందాన్ని ఎప్పుడూ రైటింగ్ తో బిజీగా ఉంచే సుక్కు దానికి తగ్గ ఫలితాలే అందుకుంటారు.
ఒకరకంగా చెప్పాలంటే ఇది చాలా తెలివైన ఎత్తుగడ. స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఏళ్లకేళ్లు పడుతున్న ట్రెండ్ లో ఖాళీగా ఉన్న సమయంలో మీడియం బడ్జెట్ కు సరిపోయే కథలు రాసుకుని వాటిని అమ్మేసుకోవడం వల్ల ఇటు కాసులు అటు రచయితగా పేరు రెండూ వచ్చేస్తాయి. ఇవే కాదు ఇకపై కూడా యూత్ హీరోలతో ఇలాంటి కొనసాగించేలా సుకుమార్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. పుష్ప 2 వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావొచ్చు. ఆపై రామ్ చరణ్ తో స్టార్ట్ చేయాల్సిన ప్రాజెక్టు ఉంటుంది. ఇది పక్కాగా ఉంటుందా లేక ఆలస్యమవుతుందానేది 2024లోనే తేలేది
This post was last modified on February 8, 2023 1:13 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…