గతంలో చెప్పినట్టే ‘బాహుబలి’ రూట్లోనే ‘పుష్ప’ కోసం యూనిట్ రామోజీ ఫిలిమ్ సిటీకి షిఫ్ట్ అవ్వబోతుంది. ఇటీవలే వైజాగ్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ నెక్స్ట్ హైదరాబాద్ లో ఓ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తుంది. మరో రెండ్రోజుల్లో ఫిలిమ్ సిటీలో వేసిన సెట్ లో సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ జరగనుంది.
ఇప్పటికే షూటింగ్ విషయంలో చాలా ఆలస్యం చేస్తూ వస్తున్న సుకుమార్ ఇకపై ఎక్కువ బ్రేకులు లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఫిలిమ్ సిటీలోనే యూనిట్ తో ఉంటూ కీలక సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ తీసే ఆలోచనలో ఉన్నాడు. రామోజీ ఫిలిమ్ సిటీ నుండి రోజు ప్రయాణం చేయకుండా ఆ టైమ్ ను కూడా షూటింగ్ కోసం వాడుకునే ప్లానింగ్ లో ఉన్నాడు సుక్కు.
ఇందులో భాగంగా పుష్ప టీం ఫిలిమ్ సిటీ కి షిఫ్ట్ అవ్వబోతుంది. అక్కడే ఉంటూ కొన్ని రోజుల పాటు ఘాట్ చేసే ప్లానింగ్ రెడీ అవుతుంది. టీంకి నిర్మాతలు అక్కడే నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. షూటింగ్ అవ్వడం కాస్త లేట్ అయినా అక్కడే ఉండేటట్టు ప్రణాళికా సిద్దం చేశారు. ఇక బన్నీ కి మినహాయింపు ఉండవచ్చు. లేదంటే రెండ్రోజుల కోసారి బన్నీ ఇంటికెళ్ళే ఛాన్స్ ఉంది. ఏదేమైనా పుష్ప2 షూటింగ్ విషయంలో సుకుమార్ స్పీడ్ పెంచాడు. మరి ఈ సుక్కు ఈ స్పీడ్ ఎంత వరకు కంటిన్యూ చేస్తాడో చూడాలి.
This post was last modified on February 7, 2023 10:31 pm
తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని.. ఏపీలో మాదిరిగా ఈసారి వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని.. పార్టీ అధినేత,…
సీనియర్ స్టార్ హీరోలలో వందా రెండు వందల కోట్ల క్లబ్బులో చిరంజీవి, బాలకృష్ణతో పాటు వెంకటేష్ చేరిపోయారు. ఇక నాగార్జున…
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్కు ముందు అర్ష్దీప్ సింగ్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఈ సిరీస్ తొలి…
అగ్ర రాజ్యం అమెరికాకు నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఆదిలోనే అదిరిపోయే నిర్ణయాలతో యావత్తు ప్రపంచ…
వివిధ భాషల్లో కొత్త సినిమాలను ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో ప్రమోట్ చేయడం కొన్నేళ్లుగా నడుస్తున్న ట్రెండ్. ఈ ట్రెండుకు…
సంక్రాంతికి ఓ పెద్ద సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుందంటే రికార్డులు బద్దలు కావాల్సిందే. ఐతే ఈసారి ‘గేమ్ చేంజర్’…