బాలీవుడ్ లో హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ పోయే స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ దే అగ్ర స్థానం. గత ఏడాది మాములు డిజాస్టర్లు పడలేదు. సామ్రాట్ పృథ్విరాజ్, రక్షా బంధన్, బచ్చన్ పాండే, రామ్ సేతు ఓ రేంజ్ లో దెబ్బ కొట్టాయి. థియేటర్ల నుంచి జనాలు పారిపోయే రేంజ్ లో భయపెట్టాయి. ఇక్కడ బెల్లంకొండ చేసిన రాక్షసుడు హిందీ రీమేక్ కట్ పుత్లీని తెలివిగా ఓటిటి రిలీజ్ చేశారు కాబట్టి బ్రతికిపోయింది కానీ లేదంటే దాని పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. అందుకే అక్కి మీద సోషల్ మీడియాలో బోలెడు నెగటివిటీ కనిపిస్తుంది.
తాజాగా ఇతను మరో వివాదంలో చిక్కుకున్నాడు. అక్షయ్ కుమార్ త్వరలో నార్త్ అమెరికాలో ఒక టూర్ చేయబోతున్నాడు. దిశా పటాని, నోరా ఫతేహ్, మౌని రాయ్ తదితరులు పాల్గొనబోతున్నారు. దీని కోసం ఒక ప్రమోషనల్ వీడియో తయారు చేశారు. ప్రపంచ దేశాలను చూపించే గ్లోబ్ బొమ్మ మీద అక్షయ్ నడుచుకుంటూ రావడం అందులో ఉంది. షూస్ వేసుకున్న కాళ్లతో దేశ పటాల మీద అలా అవమాన పరిచే రీతిలో వాక్ చేయడమేంటని నెటిజెన్లు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. పదే పదే దేశభక్తి గురించి లెక్చర్లు ఇచ్చే అక్షయ్ కుమార్ ఇదేనా కంట్రీ లవ్ అంటూ నిలదీస్తున్నారు.
దీన్ని మొన్న ట్వీట్ చేసిన అక్షయ్ ఇంత వివాదం రేగినా కూడా డిలీట్ చేయకుండా అలాగే ఉంచేశాడు. మార్చి 3న అట్లాంటాతో మొదలై మార్చ్ 11న ఓర్లాండోతో ఈ టూర్ ముగుస్తుంది. మొత్తం తొమ్మిది మంది స్టార్లు పాల్గొనబోతున్నారు. ఎంత ట్విట్టర్ లో వచ్చే వాటిని లైట్ తీసుకున్నా ఇది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మళయాలం హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ సెల్ఫీ త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో అక్షయ్ కుమార్ ఈ డ్యామేజ్ ని వీలైనంత తగ్గించుకోవడం మంచిది. లేదంటే మళ్ళీ బాయ్ కాట్ నినాదాలు వచ్చాయంటే తలనెప్పే.
This post was last modified on February 7, 2023 4:55 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…