నిన్న ఉన్నపళంగా అల్లు అరవింద్ ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ అనే న్యూస్ మీడియాకి అందింది. ఆ వెంటనే మీడియా అంతా దీని వెనుక అసలేం జరుగుతుందనే ఆరా తీయడం మొదలు పెట్టింది. దీంతో పరశురామ్ మేటర్ బయటికొచ్చింది. దర్శకుడు పరశురామ్ గీతా ఆర్ట్స్ లో ‘గీత గోవిందం’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా తర్వాత వెంటనే గీతా ఆర్ట్స్ లోనే మరో సినిమాకు అడ్వాన్స్ అందుకున్నాడు పరశురామ్. కానీ స్క్రిప్ట్ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. తర్వాత పరశురామ్ 14 రీల్స్ దగ్గర అడ్వాన్స్ అందుకున్నాడు. మైత్రి కూడా గీత గోవిందం టైమ్ లో ఎడ్వాన్స్ ఇచ్చారు. ఇంకా మరిన్ని బేనర్స్ దగ్గర పరశురామ్ అడ్వాన్స్ అందుకున్నాడు. ఇక్కడే అసలు చిక్కొచ్చింది.
సర్కారు వారి పాట కంటే ముందే పరశురామ్ 14 రీల్స్ లో నాగ చైతన్య తో ఓ సినిమా చేయాల్సి ఉంది. మహేష్ ఛాన్స్ ఇవ్వడంతో ఆ సినిమాను పక్కన పెట్టేసి సర్కారు వారి పాట సినిమాకు షిఫ్ట్ అయ్యాడు. అందులోనే 14 రీల్స్ ను కూడా ఇన్వాల్వ్ చేసేశాడు. కానీ వాళ్ళకి సోలోగా ఓ సినిమా చేయాల్సి ఉంది. నాగ చైతన్య కి ఓ కథ చెప్పాడు. కానీ అది వర్కవుట్ అవ్వట్లేదు. అందుకే మరో ప్రాజెక్ట్ వెతికే క్రమంలో విజయ్ కి ఓ లైన్ చెప్పడం ఒప్పించడం జరిగింది.
పరశురామ్ , విజయ్ కాంబో సినిమాను దిల్ రాజు ఫస్ట్ గా ఎనౌన్స్ చేసేశాడు. పరశురామ్ గీతా ఆర్ట్స్ లో నెక్స్ట్ సినిమా చేయాల్సి ఉంది. విజయ్ తో అక్కడికి వెళ్తే ప్రాజెక్ట్ సెట్ అయ్యేది కానీ పరశురామ్ యూ టర్న్ తీసుకొని దిల్ రాజు బేనర్ లో సినిమా ఒకే చేయించుకోవడమే అరవింద్ గారికి ఆగ్రహం తెప్పించింది. ఏదేమైనా నిన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి అసలు మీటర్ ఓపెన్ చేస్తే ఇండస్ట్రీలో కొత్త రచ్చ మొదలయ్యేది. కానీ ఈ లోపు పరశురామ్ భార్య అర్చన రంగంలో దిగి అల్లు అరవింద్ ను స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి ప్రెస్ మీట్ ఆపించారని తెలుస్తుంది.
పరశురామ్ వ్యవహారాలన్నీ ఆమె చూసుకుంటుంది. అందుకే ఆమె రంగంలో దిగడం ప్రాబ్లెమ్ వెంటనే సాల్వ్ అవ్వడం గంటల్లో జరిగిపోయిందట. ఇక అల్లు అరవింద్ కూడా ఆమె ఆవేదన అర్థం చేసుకొని సైలెంట్ అయ్యారని టాక్ వినబడుతుంది. ఏదేమైనా ఈ సినారియోలో పరశురామ్ అందిన చోట్ల అడ్వాన్సులు తీసుకొని ఇరుక్కున్నట్టు క్లియర్ కట్ గా కనిపిస్తుంది.
This post was last modified on February 7, 2023 3:22 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…