సంక్రాంతి సినిమాల సందడి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ ఎప్పుడూ కొంచెం డల్ అవుతుంటుంది. ఈ ఏడాది కూడా అందుకు భిన్నమేమీ కాదు. సంక్రాంతి వీకెండ్ తర్వాతి వారాంతంలో సినిమాలేవీ రిలీజ్ కాలేదు.
ఇక రిపబ్లిక్ డే వీకెండ్లో రిలీజైన ‘హంట్’ మూవీ కనీస స్థాయిలో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఇక ఈ వీకెండ్లో మూడు సినిమాలు ప్రేక్షకుల తీర్పు కోసం వచ్చాయి. అందులో సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మైకేల్’ కొంచెం పెద్ద స్థాయి సినిమా.
ఇది కాక ‘రైటర్ పద్మభూషణ్’, ‘బుట్టుబొమ్మ’ అనే చిన్న సినిమాలు కూడా రిలీజయ్యాయి. ఐతే ఈ మూడు చిత్రాల్లో ప్రేక్షకును ఆకట్టుకున్నది ఒక్క చిత్రమే. అదే.. రైటర్ పద్మభూషణ్. మిగతా రెండు చిత్రాలకు నిరాశ తప్పలేదు.
ఈ వారం ‘మైకేల్’యే పెద్ద స్థాయి సినిమా అయినప్పటికీ.. దాంతో పోలిస్తే ‘రైటర్ పద్మభూషణ్’కే రిలీజ్ ముంగిట మంచి బజ్ వచ్చింది. డిఫరెంట్ ప్రమోషన్లు, ప్రోమోలు ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. రిలీజ్ ముందు రోజే ప్రిమియర్లు వేయగా.. వాటికి మంచి స్పందన వచ్చింది.
ఆ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక్కడి నుంచే టాక్ కూడా పాజిటివ్‌గా రావడంతో తొలి రోజు కూడా మంచి ఆక్యుపెన్సీ కనిపించింది థియేటర్లలో. ఈ సినిమా స్థాయికి మించి వీకెండ్లో వసూళ్లు రాబట్టింది. యుఎస్ ప్రేక్షకులు సైతం సినిమాను మెచ్చి బాగానే చూస్తున్నారు.
అక్కడ ఇప్పటికే 2 లక్షల డాలర్ల వసూళ్లు రావడం విశేషం. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి 5 కోట్లకు పైగా గ్రాస్ వస్తున్నట్లు అంచనా. మరోవైపు లో బజ్‌తో రిలీజైన మైకేల్, బుట్టబొమ్మ సినిమాలకు బ్యాడ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే ఉన్నాయి. మైకేల్ అయినా ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ తెచ్చుకుంది కానీ.. బుట్టబొమ్మ మాత్రం దాదాపు వాషౌట్ అయిపోయినట్లే కనిపిస్తోంది.
This post was last modified on February 6, 2023 7:56 am
‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…
‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…
ఇంకో మూడు రోజుల్లో జైలర్ 2 విడుదల కానుంది. నైజామ్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్…
ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం. ఫేమ్ లేనపుడు చేసే కొన్ని పనులు.. తర్వాత అనుకోని ఇబ్బందిగా…
రాజమౌళి కెరీర్‌ను అతి పెద్ద మలుపు తిప్పిన సినిమాగా అందరూ ‘బాహుబలి’నే చెబుతారు. ఆయన కెరీర్‌ను ‘బాహుబలి’కి ముందు, తర్వాత…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…