హనీరోజ్ హవా మామూలుగా లేదుగా? ఇదెక్కడి ఫాలోయింగ్ రా బాబు

సంక్రాంతి వేళ విడుదలైన సినిమాల్లో ముందుగా వచ్చిన వీర సింహారెడ్డి సినిమా చూసే వరకు చాలామందికి హనీరోజ్ అంటే ఎవరో తెలీదు. పేరుకు తగ్గట్లే అంతే అందంగా ఉండే హనీరోజ్ ను స్క్రీన్ మీద చూసిన వారంతా ఫిదా అయిపోయారు.

ఆమె ఎవరు? ఎక్కడి వారు? ఏమేం సినిమాలు చేశారు? లాంటి వివరాల్ని గూగుల్ తెగ వెతికేశారు. ఈ సినిమాతో ఆమెకు సరికొత్త ఫ్యాన్ బేస్ వచ్చేసింది. అయితే.. తెలుగు ప్రజలకు తెలీటానికి ముందే మళయాళంలో ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఆ గులాబీ పువ్వుకు బోలెడంత మంది అభిమానులు ఉన్నారు.

యూత్ లో ఆమెకున్న క్రేజ్ ఎంతన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. తాజాగా ఆమె కేరళలోని ఒక షోరూం ఓపెనింగ్ కు వెళ్లారు. ఆమె వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ప్రజలు అక్కడికి వచ్చేయటం మామూలుగా జరిగేదే. కానీ.. హనీరోజ్ ను చూసేందుకు సదరు షోరూం ఉన్న పక్కనున్న జిల్లాల నుంచి కూడా బస్సుల్లో భారీగా జనాలు వచ్చిన వైనం చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.

హనీరోజ్ కు ఉన్న క్రేజ్ ను చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆమె కోసం భద్రతను భారీగా ఏర్పాటు చేసినా.. వచ్చి పడిన జనసందోహాన్ని చూసిన పోలీసులు అవాక్కు అయ్యే పరిస్థితి. షోరూంకు వచ్చిన ఆమె.. భద్రంగా ఆమె కారులో ఎక్కించి పంపేందుకు పోలీసులు.. బౌన్సర్లు పడిన అవస్థలు అన్ని ఇన్ని కావంటున్నారు.

ఆమెతో సెల్పీలకు పెద్ద ఎత్తున ముందుకొచ్చిన వారిని కంట్రోల్ చేయటం కష్టతరంగా మారిందంటున్నారు. కొందరు ఆమె మీద పడిపోయిన పరిస్థితి. చివరకు ఆమెను భద్రంగా పంపించేశారు. హనీరోజ్ క్రేజ్ ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది.