రామ్ గోపాల్ వర్మ ఎప్పుడేమి తీసుకున్నా కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి అంతగా స్పందన రాదు. కానీ పవన్ కళ్యాణ్ ని కిండల్ చేస్తూ తీస్తున్న పవర్ స్టార్ సినిమా పట్ల మాత్రం ఇండస్ట్రీలోనే వ్యతిరేకత ఉంది. చాలా మంది లోలోపల తిట్టుకుంటూ వుంటే… మాములుగా అతనితో ఎందుకు గొడవ అనుకునే సినిమా వాళ్ళలోనూ కొంతమంది గట్టిగానే గడ్డి పెడుతున్నారు.
రామజోగయ్య శాస్త్రి లాంటి వాళ్ళు సుతిమెత్తగా తిడితే కొందరు వర్మను ఎగతాళి చేసే సినిమాలకు శ్రీకారం చుట్టారు. హీరో నిఖిల్ మాత్రం వర్మను కుక్కతో పోలుస్తూ పవన్ కళ్యాణ్ శిఖరం లాంటి వాడని.. కుక్క మొరిగితే ఏమి కాదని ట్వీట్ చేసాడు.
ఇది డైరెక్ట్ గా వర్మ దగ్గరికే తీసుకెళ్లి నిఖిల్ ఇలా కుక్క అంటున్నాడని చెప్పారు మీడియా వాళ్ళు. అసలు తనకు నిఖిల్ ఎవరో తెలియదని… ఒకవేళ అతను పేరున్న నటుడే అయినా కానీ.. అతనికీ అనామకులైన పవన్ అభిమానులకు తేడా లేదని, వీళ్ళందిరిదీ బానిస స్వభావమని, పవన్ ప్రాపకం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారని, వాళ్ళను తానూ పట్టించుకోనని అన్నాడు.
ఏదేమైనా… మహా అయితే పవన్ అభిమానుల నుంచి నెగటివ్ ట్వీట్స్ లేదా… తన దిష్టి బొమ్మల దగ్ధం లాంటి స్పందన ఉండొచ్చు అనుకున్న వర్మకి ఈ స్థాయి తిరుగుబాటు షాక్ ఇస్తున్నట్టే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates