Movie News

నిఖిల్ స్పై తెలివిగా ముందడుగు వేస్తాడా

ఏదైనా కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నప్పుడు అలాంటిదే మన పోటీదారులు చేస్తున్నప్పుడు రిలీజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పోలిక దగ్గర ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం మారిపోతుంది. అఖిల్ ఏజెంట్ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28ని అఫీషియల్ గా నిన్న ప్రకటించాల్సి ఉంది. ఆ మేరకు ముందే అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అయితే కళాతపస్వి విశ్వనాథ్ గారు శివైక్యం చెందటంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. బహుశా రేపో మరికొద్ది రోజుల్లో అధికారికంగా చెబుతారు. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో నిర్మాత అనిల్ సుంకర భారీ ప్లానింగ్ చేస్తున్నారు.

దీనికి స్పైకి కనెక్షన్ ఏంటంటే రెండూ గూఢచారి బ్యాక్ డ్రాప్ లోనే రూపొందటం. నిఖిల్ సినిమా దాదాపు పూర్తి కావొస్తోంది. తన కెరీర్ లోనే కార్తికేయ 2ని మించి అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రమిది. మల్టీ లాంగ్వేజెస్ లో రెడీ చేస్తున్నారు. ఎందుకైనా మంచిదని స్పైని ఏప్రిల్ 14నే అంటే రెండు వారాల ముందే దించితే సేఫ్ గేమ్ ఆడినట్టు ఉంటుందనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. రేంజ్ బడ్జెట్ రెండూ ఒకటే కాకపోయినా కూడా ఆడియన్స్ పోల్చుకునే విషయంలో అలాంటి మొహమాటాలు ఏమి పెట్టుకోరు కాబట్టి వీలైనంత రిస్క్ తగ్గించుకోవడం ఎంతైనా అవసరం.

సో నిఖిల్ కోరుకున్నట్టు ముందు రావడం సాధ్యపడుతుందా లేదానేది రకరకాల క్యాలికులేషన్ల మీద ఆధారపడి ఉంటుంది. ముందైతే షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ ని వేగవంతం చేయాలి. అవతల ఏజెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. క్లైమాక్స్ కి ఎక్కువ సమయం తీసుకున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. శివరాత్రికి టీజర్ వదలొచ్చు. మొత్తానికి టాలీవుడ్ లో అడవి శేష్ గూఢచారి హిట్టయ్యాక మళ్ళీ ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఒకప్పుడు కృష్ణ, చిరంజీవి లాంటి అగ్రహీరోలు చేశాక కొంత కాలం ఈ జానర్ ని ఎవరూ టచ్ చేయలేదు కానీ తిరిగి ఇప్పుడు యంగ్ హీరోస్ అందరూ ఈ బ్యాక్ డ్రాప్ ని కోరి మరీ చేస్తున్నారు.

This post was last modified on February 4, 2023 7:28 am

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

2 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

3 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

3 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

3 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

6 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

6 hours ago