నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతోంది. వారం కిందట యువగళం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురై మృత్యు అంచులకు వెళ్లిన అతను.. తర్వాత కొంచెం కోలుకున్న సంగతి తెలిసిందే. కానీ అతడికి ప్రమాదం మాత్రం తప్పినట్లు కాదు. ఇప్పటికీ వెంటిలేటర్ మీదే చికిత్స అందిస్తున్నారు. గుండెపోటు తర్వాత చికిత్సలో ఆలస్యం జరగడం వల్ల తారకరత్న మెదడు దెబ్బ తిన్నట్లు వార్తలు వచ్చాయి. మెదడులో వాపురావడంతో దాన్ని సాధారణ స్థితికి తెచ్చేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా ప్రస్తుతం అందుతున్న దాని కంటే ఇంకా మెరుగైన చికిత్స అవసరం పడితే తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యుకలు సిద్ధపడుతున్నట్లు తాజా సమాచారం. ఈ మేరకు తారకరత్నను ఆసుపత్రిలో చూసి వచ్చిన తెలుగుదేశం నేత అంబికా లక్ష్మీనారాయణ సంకేతాలు ఇచ్చారు.
తారకరత్న హెల్త్ అప్‌డేట్ గురించి అంబికా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్నకు సంబంధించిన ఓ హెల్త్ రిపోర్ట్ కీలకం కానుంది. EEG స్కానింగ్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం. ఇవాళ రాత్రిలోపు డాక్టర్ల చేతికి నివేదిక రానుంది. మెదడులో కొంతమేర వాపు రావడంతో దాన్ని నయం చేసే చికిత్సపై డాక్టర్లు ఫోకస్ చేశారు. తారకరత్నకు వెంటిలేటర్‌పైనే ఇంకా చికిత్స కొనసాగిస్తున్నారు. ఆయన కోలుకోవడానికి సమయం పడుతుంది. ఇవాళ తారకరత్న మెదడు స్కానింగ్ చేశారు. వచ్చే నివేదికల ఆధారంగా మెదడు ఎలా పనిచేస్తుంది..? అనే విషయం తెలుస్తుంది. పరిస్థితిని బట్టి మెరుగైన చికిత్స కోసం తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచన కూడా ఉంది. కుటుంబ సభ్యులు అంతా చర్చించుకుని విదేశాలకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. తారకర్నతను బాలయ్యే దగ్గరుండి బాగోగులు చూసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.
This post was last modified on February 4, 2023 6:49 am
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…