ఒక సినిమా అనుకోకుండా చాలా పెద్ద హిట్టయితే.. భారీ వసూళ్లు సాధిస్తే.. ట్రెండ్ సెట్ చేస్తే.. ఆ తర్వాత అలాంటి సినిమాలే రావడం మామూలే. కానీ ఇలాంటి సినిమాలను అనుకరిస్తూ చేసే ప్రయత్నాలు వర్కవుట్ కావడం కష్టం. ప్రేక్షకులు అప్పటికే అలాంటి సినిమా ఒకటి చూశాక.. దాన్ని అనుకరించే సినిమాను ఎందుకు ఆదరిస్తారు? ఈ చిన్న లాజిక్ తెలియకుండా కష్టపడిపోతుంటారు ఫిలిం మేకర్స్.
‘కేజీఎఫ్’ తర్వాత దాని బాటలో వివిధ ఇండస్ట్రీల్లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఆల్రెడీ కన్నడలోనే ఉపేంద్ర హీరోగా ‘కబ్జ’ అనే సినిమా తీస్తున్నారు. దాని ట్రైలర్ చూస్తే ‘కేజీఎఫ్’ను మళ్లీ దించేస్తున్నట్లు అనిపించింది. ఇంకా రిలీజ్ కాని ఈ సినిమా మీద జనాల్లో ఏమంత మంచి ఒపీనియన్ లేదు. దాని ఫలితం ఏమవుతుందో కానీ.. ఇంతలో ‘మైకేల్’ అనే సినిమా వచ్చింది.
ట్రైలర్ చూస్తే ఏమీ ‘కేజీఎఫ్’ లాగా అనిపించలేదు కానీ.. సినిమా చూసిన వాళ్లకు ముందు ‘కేజీఎఫ్’యే కళ్ల ముందు కదలాడింది. ‘కేజీఎఫ్’ లాగే ఇది కూడా మూడు దశాబ్దాల ముందు నడిచే కథ. విజువల్స్ అంతా కూడా ‘కేజీఎఫ్’నే తలపిస్తాయి. ‘కేజీఎఫ్’లో మాదిరే ఇందులోనూ హీరో ఒక అనాథ. చిన్నపుడే తల్లిని కోల్పోతాడు. ఒక లక్ష్యంతో ముంబయిలో అడుగు పెడతాడు. అక్కడ విలన్ దగ్గర చేరి.. అంచెలంచెలుగా ఎదుగుతాడు. సినిమా అంతటా కూడా హీరో గురించి ఒక పాత్ర నరేట్ చేస్తూ.. అతడికి ఎలివేషన్ ఇస్తూ సాగుతుంది. అతను మాత్రమే కాదు.. వేరే పాత్రలు కూడా హీరో కనిపిస్తే చాలు అతను వీరుడు శూరుడు అంటూ ఎలివేషన్ ఇస్తుంటాయి.
హీరో కనిపించిన ప్రతిసారీ విపరీతమైన బిల్డప్.. ఎదురొచ్చిన ప్రతి ఒక్కరినీ అతను ఉతికి ఆరేస్తుంటాడు. బ్యాగ్రౌండ్ స్కోర్‌తోనూ హీరో పాత్రకు మామూలు ఎలివేషన్ ఇవ్వలేదు. కానీ ఏం లాభం? ఈ అదనపు హంగులు, అవసరానికి మించిన ఎలివేషన్లు తప్ప కథాకథనాల్లో, సన్నివేశాల్లో విషయం కొరవడింది. ‘కేజీఎఫ్’కు ఇదొక పేల్ ఇమిటేషన్ లాగా అనిపించి ప్రేక్షకులు నిట్టూరుస్తున్నారు.
This post was last modified on February 4, 2023 6:52 am
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…