ఈ వారం రిలీజవుతున్న సినిమాల్లో కొంచెం పెద్ద స్థాయి ఉన్నదంటే ‘మైకేల్’ అనే చెప్పాలి. హీరోగా అతడికి కొంచెం ఇమేజ్ ఉంది. ఇందులో విజయ్ సేతుపతి సహా పేరున్న నటీనటులు చాలామంది నటించారు. అందులోనూ ఇది యాక్షన్ సినిమా. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఐతే ఇన్ని ఆకర్షణలున్న సినిమా కంటే కూడా ‘రైటర్ పద్మభూషణ్’ అనే చిన్న సినిమాకు ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తుండడం ఆశ్చర్యకరం. ఈ వారానికే షెడ్యూల్ అయిన మరో చిత్రం ‘బుట్టబొమ్మ’కు అస్సలు బజ్ కనిపించకపోగా.. ‘మైకేల్’ పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. కానీ ‘రైటర్ పద్మభూషణ్’ మాత్రం రిలీజ్ ముంగిట అనూహ్యంగా మంచి బజ్ తెచ్చుకుంది.
తమ షార్ట్ ఫిలిమ్స్.. వెబ్ సిరీస్‌లను కొంచెం భిన్నంగా ప్రమోట్ చేసి జనాలకు చేరువ చేయడంలో నైపుణ్యం సాధించిన ఛాయ్ బిస్కెట్ సంస్థ.. తమ ప్రొడక్షన్లో వస్తున్న తొలి ఫుల్ లెంగ్త్ సినిమా అయిన ‘పద్మభూషణ్’ విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ముందు నుంచి సినిమాను వెరైటీగా ప్రమోట్ చేసింది. దీని ప్రోమోలు కూడా బాగుండడంతో సినిమా పట్ల ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపించింది.
ఇక సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్‌తో టీం ముందు రోజు రాత్రే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రిమియర్స్ వేసింది. యుఎస్ ప్రిమియర్స్ కంటే ముందే ఇక్కడ షోలు పడ్డాయి. ముందు కొన్ని షోలే పెట్టగా.. వాటికి మంచి రెస్పాన్స్ కనిపించడంతో షోలు పెంచుతూ పోయారు. హైదరాబాద్ సిటీలో రెండంకెల సంఖ్యలో షోలు వేయగా.. దాదాపుగా అన్నీ కూడా హౌస్ ఫుల్ అయిపోవడం విశేషం.
సినిమాకు టాక్ కూడా పాజిటివ్‌గా ఉండడంతో రిలీజ్ రోజు మార్నింగ్ షోలకు థియేటర్ల ముందు బాగానే సందడి కనిపించింది. సుహాస్ అనే చిన్న నటుడి సినిమాకు ఇంత సందడి నెలకొనడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సినిమాలో కంటెంట్ ఉండి సరిగా ప్రమోట్ చేస్తే చిన్న చిత్రానికైనా జనాలను థియేటర్లకు రప్పించడం కష్టమేమీ కాదని ‘రైటర్ పద్మభూషణ్’ టీం రుజువు చేసింది.
This post was last modified on February 3, 2023 3:52 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…