తమిళంలో ప్రస్తుతం నంబర్ వన్ హీరో విజయే అని దిల్ రాజు నెల కిందట వ్యాఖ్యానించినపుడు పెద్ద దుమారమే రేగింది. టాక్‌తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు కొన్నేళ్ల నుంచి తమిళనాట రూ.60 కోట్లకు తక్కువ కాకుండా షేర్ రాబడుతున్న నేపథ్యంలో విజయ్‌ని తాను నంబర్ వన్ హీరో అన్నట్లు దిల్ రాజు తర్వాత వివరణ కూడా ఇచ్చుకున్నా రజినీకాంత్, అజిత్ అభిమానులు ఊరుకోలేదు. ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేశారు.
ఐతే ఫలానా హీరో నంబర్ వన్ అని బహిరంగంగా ప్రకటించడం కరెక్ట్ కాదు కానీ.. దిల్ రాజు మాటలు మాత్రం అబద్ధం కాదు. కొన్నేళ్ల నుంచి తమిళనాడు బాక్సాఫీస్‌లో విజయ్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో మరే హీరో అయినా విజయ్ తర్వాతే అని మరోసారి రుజువైంది. సంక్రాంతికి రిలీజైన అతడి లేటెస్ట్ మూవీ ‘వారిసు’కు వచ్చిన వసూళ్లే ఇందుకు ఉదాహరణ.
‘వారిసు’కు తెలుగులోనే కాదు.. తమిళంలోనే ఏమంత మంచి టాక్ రాలేదు. దీంతో పోలిస్తే అజిత్ మూవీ ‘తునివు’నే బెటర్ టాక్ తెచ్చుకుంది. ఆరంభంలో వసూళ్ల పరంగా కూడా ‘తునివు’దే ఆధిపత్యం. దీంతో విజయ్ సినిమాకు కష్టమే అన్నారంతా. దాని ఓపెనింగ్స్ చూసి రాజును ట్రోల్ చేశారు కూడా.
కానీ తర్వాత మొదలైంది అసలు కథ. ‘వారిసు’ నిలకడగా వసూళ్లు రాబడుతూ దూసుకెళ్లింది. ‘తునివు’ డౌన్ అయింది. తమిళనాడు అవతల ఎక్కడా ‘తునివు’ విజయ్ సినిమా ముందు నిలబడలేకపోయింది.
‘వారిసు’ టీం వసూళ్లను కొంచెం ఎక్కువ చేసి చూపించుకున్న మాట వాస్తవమే కానీ.. ఓవరాల్‌గా మాత్రం ఆ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. రూ.200 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. ‘తునివు’ కంటే 30 శాతం దాకా ‘వారిసు’కు ఎక్కువ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డివైడ్ టాక్‌తో ఈ వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. దీంతో తమిళంలో ఇప్పుడు విజయే నంబర్ వన్ హీరో అని మరోసారి రుజువు అయింది.
This post was last modified on February 2, 2023 10:49 pm
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…
ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…