ఏ సినిమాకైనా ప్రమోషన్లలో టీజర్ కట్ ఎంత ముఖ్యమో దసరా నిరూపిస్తోంది. మొన్నటి దాకా కేవలం పోస్టర్లు చూస్తూ ఇదేదో పుష్ప టైప్ రా డ్రామాని జనాలు అనుకున్నారు కానీ అంతకు మించిన వయొలెంట్ యాక్షన్ భారీగా ఉందని కేవలం నిమిషం వీడియోలోనే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చూపించిన శాంపిల్ కి ట్రేడ్ ఊగిపోతోంది. ప్యాన్ ఇండియా రిలీజ్ కావడంతో నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఇప్పుడు పక్కాగా వచ్చేసింది. రిలీజ్ కు ఇంకో యాభై ఎనిమిది రోజులే ఉన్న నేపథ్యంలో ఏరియాల వారిగా బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి.
డిస్ట్రిబ్యూషన్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు దసరాని చదలవాడ 24 కోట్లకు మొత్తం థియేట్రికల్ హక్కులు కొనుక్కుంటే దానికి అదనంగా నాలుగు కోట్లు ఆఫర్ చేసి దిల్ రాజు ఫైనల్ గా 28 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు పంపిణీదారులు రాజుగారికి ఇస్తున్న ఆఫర్లు చూస్తుంటే హీనపక్షం అయిదు నుంచి పది కోట్ల మధ్యలో లాభాలు రావడం ఖాయమంటున్నారు. అవుట్ రైట్ గా అమ్మేస్తారా లేక తనకు పట్టున్న వైజాగ్, నైజామ్ లాంటి కొన్ని ప్రాంతాలు ఉంచుకుని మిగిలినవి ఇస్తారానేది వేచి చూడాలి. కంటెంట్ కనక వర్కౌట్ అయితే ఫైనల్ రన్ కు నలభై కోట్లకు పైగానే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
ఇంకా ట్రైలర్ బాకీ ఉంది. కీర్తి సురేష్ ని పరిచయం చేయాల్సి ఉంది. మిగిలిన పాటలు బాలన్స్ ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇతరత్రా అవుట్ డోర్ పబ్లిసిటీ చాలా ఉంది. అసలు ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఇంకొంత టైం ఆగి ఉంటే మంచి లాభం వెనకేసుకుని ఉండేవారని ఓపెన్ గానే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంత హైప్ తలెత్తడానికి కారణం లేకపోలేదు. పుష్ప, రంగస్థలం, కెజిఎఫ్ తరహా రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ మాస్ ఆడియన్స్ ని ఖచ్చితంగా మెప్పిస్తుందని భారీ వసూళ్ల సాక్షిగా నిరూపితమయ్యింది. మరి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ దసరా మీద ఉండటంలో ఆశ్చర్యం ఏముంది.
This post was last modified on February 1, 2023 7:27 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…