ఈ ఏడాది ఆరంభంలో ఎన్నాడో లేని విధంగా దిల్ రాజు పై ట్రోలింగ్ జరిగింది. ఇదంతా సంక్రాంతి బరిలో నిలిచిన వారసుడు వల్లే. గతంలో సంక్రాంతికి తెలుగు సినిమాలు రిలీజ్ ఉండగా డబ్బింగ్ సినిమాకి కావాల్సినన్నీ థియేటర్స్ ఎలా ఇస్తామంటూ చెప్పిన దిల్ రాజు ఈసారి తమిళ్ సినిమాను తెలుగులో ఎలా రిలీజ్ చేస్తారని అందరూ ప్రశ్నించారు. తను తెలుగు నిర్మాత అని డైరెక్టర్ కూడా తెలుగు వాడని దిల్ రాజు సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. కట్ చేస్తే ఓ సందర్భంలో వెనక్కి తగ్గి వారసుడు రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది.
ఇదంతా ఆలోచించి నెక్స్ట్ సంక్రాంతికి భారీ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడట దిల్ రాజు. వచ్చే సంక్రాంతికి రామ్ చరణ్ -శంకర్ కాంబో మూవీ rc15 ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. అందరి కంటే ముందే సంక్రాంతి 2024 స్లాట్ పై కన్నేసి తన పాన్ ఇండియా సినిమాతో సందడి చేయాలని భావిస్తున్నాడట.
రామ్ చరణ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న rc15 షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అనుకున్న టైమ్ కి షూటింగ్ జరిగితే సినిమా ఈ ఏడాదే థియేటర్స్ లోకి రావాలి. కానీ శంకర్ భారీ మేకింగ్ , అవుట్ డోర్ ఘాట్ కారణం చేత బ్రేకులు పడుతూ తెరకెక్కుతుంది. సినిమాను శంకర్ పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిస్తున్నాడని టాక్. వచ్చే ఏడాది ఎలెక్షన్స్ కూడా ఉన్నాయి కనుక సంక్రాంతి కి ఈ సినిమాపై భారీ హైప్ ఉండనే ఉంటుంది. అందుకే అన్నీ ఆలోచించి దిల్ రాజు కొత్త సంక్రాంతి స్కెచ్ వేసి త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇకపై దిల్ రాజు బేనర్ నుండి ప్రతీ సంక్రాంతికి ఓ సినిమా వచ్చే అవకాశం కనిపిస్తుంది.
This post was last modified on February 1, 2023 6:31 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…