ఎప్పుడో గత ఏడాది ఆగస్టు 12నే రావాల్సిన సినిమా ‘ఏజెంట్’. అఖిల్ అక్కినేని కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా తప్పలేదు. తర్వాత క్రిస్మస్ రిలీజ్ అన్నారు. ఆపై సంక్రాంతి విడుదల గురించి కూడా మాట్లాడుకున్నారు. కానీ అన్ని సీజన్లూ అయిపోయాయి. ‘ఏజెంట్’ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఐతే చివరగా ఒక డేట్ అనుకుని ఆ తేదీకే సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
వేసవి రిలీజ్‌కు ‘ఏజెంట్’ను రెడీ చేస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి సినిమా రావాల్సిన ఏప్రిల్ 14వ తేదీకి ‘ఏజెంట్’ను ఫిక్స్ చేశారట. ‘భోళా శంకర్’ వాయిదా పడి ఈ ఏడాది ద్వితీయార్ధానికి వెళ్లిపోవడంతో ‘ఏజెంట్’ కోసం ఆ డేట్‌ను తీసుకుంటున్నారట. అదే రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘జైలర్’ రాబోతోంది. కాబట్టి ‘అఖిల్’కు గట్టి పోటీ తప్పదన్నమాట.
హీరోగా తొలి మూడు చిత్రాలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్న అఖిల్.. నాలుగో చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో కొంచెం ఉపశమనం పొందాడు. అది పెద్ద హిట్ కాదు కానీ.. అఖిల్‌కు తొలి సక్సెస్ అందించింది. కానీ ఆ సినిమా వల్ల అఖిల్ ఇమేజ్ ఏమీ పెరగలేదు. ఐతే ‘ఏజెంట్’ పూర్తి స్థాయి యాక్షన్ మూవీ కావడం, హీరోయిజం ఒక రేంజిలో ఉండడంతో అఖిల్ అసలు సత్తాను బయటికి తెస్తుందని అంచనా వేస్తున్నారు.
సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తుండడం కూడా అంచనాలను పెంచేదే. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్నాడు. గత ఏడాది రిలీజైన టీజర్ సినిమాపై హైప్ పెంచింది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ సాక్షి వైద్య అఖిల్‌కు జోడీగా నటిస్తోంది. అఖిల్ ఇందులో ఏజెంట్ పాత్రలో చాలా వైల్డ్‌గా కనిపించనున్నాడట. ఈ సినిమా కోసం అఖిల్ అసాధారణ స్థాయిలో బాడీ పెంచాడు.
This post was last modified on January 31, 2023 4:51 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…