దర్శక దిగ్గజం శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆర్సి 15 మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదలైనప్పటి నుంచి ఒక ఆరేడు నెలలు షూటింగ్ సవ్యంగానే నడిచింది కానీ ఎప్పుడైతే ఇండియన్ 2ని పూర్తి చేసే బాధ్యతను ఒకే సమయంలో శంకర్ నెత్తినవేసుకున్నారో అప్పటి నుంచి రెట్టింపు ఒత్తిడితో సతమతమవుతున్నారు. క్రమంగా ఇది ఉచ్చులా మారిపోతోంది. చరణ్ ప్రాజెక్టుకు సంబంధించి జాప్యం ఎక్కువైపోవడంతో నిర్మాత దిల్ రాజుకి ఆర్థికంగా భారం పెరుగుతోంది. 2024 సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలన్నది ఆయన టార్గెట్.
మరోవైపు ఇండియన్ 2ని ప్రస్తుతం కడప జిల్లా గండికోటలో చేస్తున్న శంకర్ ఆ షెడ్యూల్ పూర్తి చేశాక తిరిగి చరణ్ తో జాయిన్ అవ్వాలి. ఎంత గొప్ప డైరెక్టరైనా ఒకేసారి రెండు ప్యాన్ ఇండియాలు హ్యాండిల్ చేయడం అంత సులభం కాదు. జేమ్స్ క్యామరూన్, స్టీవెన్ స్పిల్ బర్గ్ లాంటి వరల్డ్ క్లాస్ మాస్టర్సే ఒక టైంలో ఒక సినిమానే చేస్తారు. అలాంటిది శంకర్ డ్యూయల్ సింని బ్యాలన్స్ చేయడం కత్తి కొనమీద నడవటం లాంటిది. పైగా ఒకపక్క కమల్ హాసన్ లాంటి లెజెండ్ మరో పక్క చరణ్ లాంటి యంగ్ జెనరేషన్ స్టార్ హీరో. ఇదంతా ఒక ఎత్తు అయితే రిలీజ్ డేట్ ప్రెజర్ సైతం ఆయన మీద పడుతున్నట్టు టాక్.
ఇండియన్ 2ని అయితే దీపావళి లేదా సంక్రాంతికి తేవాలని నిర్మాణ సంస్థ లైకా ప్లాన్ లో ఉంది. మొదటి ఆప్షన్ తో ఇబ్బంది లేదు. రెండోది అయితే తన సినిమాతో తనే పండక్కు పోటీ పడాల్సి వస్తుంది. అది తమిళనాడులో దిల్ రాజుకి ఇబ్బందికర పరిణామంగా నిలుస్తుంది. థియేటర్ల విషయంలో మళ్ళీ సమస్యలు తలెత్తుతాయి. శంకర్ మూవీ అనే ట్యాగ్ పని చేయదు. ఎందుకంటే అటుపక్క ఉన్నది కూడా శంకరే కాబట్టి. సో ఎలా చూసుకున్న కమల్ ముందు వచ్చేయడమే అందరికీ క్షేమకరంగా తోస్తోంది. మరి శంకర్ ఈ ఛాలెంజ్ ఎలా ఫేస్ చేసి గట్టెక్కుతారో వేచి చూడాలి.
This post was last modified on January 31, 2023 11:49 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…