తమిళంలో ప్రస్తుత ఫామ్ పరంగా చూస్తే నంబర్ వన్ హీరో విజయ్ కాగా.. నంబర్ వన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజే. టాక్‌తో సంబంధం లేకుండా తన సినిమాలతో భారీ వసూళ్లు రాబడుతూ మిగతా హీరోల కంటే ఎత్తులో నిలుస్తున్నాడు విజయ్. ఇక ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో లోకేష్ కనకరాజ్ ఎంత పెద్ద విజయాలందుకున్నాడో తెలిసిందే.
విజయ్, లోకేష్ కలయికలో ఇప్పటికే మాస్టర్ సినిమా వచ్చింది. తమిళంలో అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ కాంబినేషన్లో ఇంకో సినిమా చాన్నాళ్ల ముందే ఖరారైంది. లోకేష్ స్వయంగా ఆ విషయాన్ని ధ్రువీకరించాడు. విక్రమ్ తర్వాత తన సినిమా విజయ్‌తోనే అన్నాడు. ఐతే ఇప్పుడు అధికారికంగా ఆ ప్రాజెక్టును ప్రకటించారు. విజయ్ 67వ సినిమాగా ఇది తెరకెక్కనుంది.
7 స్క్రీన్స్ స్టూడియో బేనర్ మీద లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడు. మాస్టర్, విక్రమ్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్ రవిచందరే ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకుడు. ఇంకా పేరున్న టెక్నీషియన్లు చాలామంది ఈ సినిమాకు పని చేయనున్నారు. లోకేష్ తొలి సినిమా మానగరంతో మొదలుపెడితే.. ఆ తర్వాత వచ్చిన ప్రతి చిత్రానికి ఒక కనెక్షన్ కనిపిస్తుంది.
విక్రమ్‌లో అతను తీసిన అన్ని సినిమాలకు ఉన్న కనెక్షన్ చూపించి లోకేష్ మల్టీవర్స్ అనే కొత్త మాటను ట్రెండ్‌లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు విజయ్‌తో చేయబోయే సినిమాకు కూడా మిగతా చిత్రాలతో కనెక్షన్ కొనసాగుతుందని భావిస్తున్నారు. మరి ఈసారి అతను ఎలాంటి కథను నరేట్ చేస్తాడు అన్నది ఆసక్తికరం. ఈ సంక్రాంతికి విడుదలైన విజయ్ కొత్త సినిమా వారిసు డివైడ్ టాక్‌తోనే భారీ వసూళ్లు రాబట్టింది. లోకేష్‌తో అతను చేయబోయే సినిమాకు హైప్ ఒక రేంజిలో ఉంటుందనడంలో సందేహం లేదు.
This post was last modified on January 30, 2023 10:29 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…