అనుకున్న‌దే.. బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబో ఫిక్స్

త‌మిళంలో ప్ర‌స్తుత ఫామ్ ప‌రంగా చూస్తే నంబ‌ర్ వ‌న్ హీరో విజ‌య్ కాగా.. నంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌క‌రాజే. టాక్‌తో సంబంధం లేకుండా త‌న సినిమాల‌తో భారీ వ‌సూళ్లు రాబ‌డుతూ మిగ‌తా హీరోల కంటే ఎత్తులో నిలుస్తున్నాడు విజ‌య్. ఇక ఖైదీ, మాస్ట‌ర్, విక్ర‌మ్ సినిమాల‌తో లోకేష్ క‌న‌క‌రాజ్ ఎంత పెద్ద విజ‌యాలందుకున్నాడో తెలిసిందే.

విజ‌య్, లోకేష్ క‌ల‌యిక‌లో ఇప్ప‌టికే మాస్ట‌ర్ సినిమా వ‌చ్చింది. త‌మిళంలో అది పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఈ కాంబినేష‌న్లో ఇంకో సినిమా చాన్నాళ్ల ముందే ఖ‌రారైంది. లోకేష్ స్వ‌యంగా ఆ విష‌యాన్ని ధ్రువీక‌రించాడు. విక్ర‌మ్ త‌ర్వాత త‌న సినిమా విజ‌య్‌తోనే అన్నాడు. ఐతే ఇప్పుడు అధికారికంగా ఆ ప్రాజెక్టును ప్ర‌క‌టించారు. విజ‌య్ 67వ సినిమాగా ఇది తెర‌కెక్క‌నుంది.

7 స్క్రీన్స్ స్టూడియో బేన‌ర్ మీద ల‌లిత్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయ‌నున్నాడు. మాస్ట‌ర్, విక్ర‌మ్ సినిమాల‌కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్ ర‌విచంద‌రే ఈ చిత్రానికి కూడా సంగీత ద‌ర్శ‌కుడు. ఇంకా పేరున్న టెక్నీషియ‌న్లు చాలామంది ఈ సినిమాకు ప‌ని చేయ‌నున్నారు. లోకేష్ తొలి సినిమా మాన‌గ‌రంతో మొద‌లుపెడితే.. ఆ త‌ర్వాత వ‌చ్చిన ప్ర‌తి చిత్రానికి ఒక క‌నెక్ష‌న్ క‌నిపిస్తుంది.

విక్ర‌మ్‌లో అత‌ను తీసిన అన్ని సినిమాలకు ఉన్న క‌నెక్ష‌న్ చూపించి లోకేష్ మ‌ల్టీవ‌ర్స్ అనే కొత్త మాట‌ను ట్రెండ్‌లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు విజ‌య్‌తో చేయ‌బోయే సినిమాకు కూడా మిగతా చిత్రాల‌తో క‌నెక్ష‌న్ కొన‌సాగుతుంద‌ని భావిస్తున్నారు. మ‌రి ఈసారి అత‌ను ఎలాంటి క‌థ‌ను న‌రేట్ చేస్తాడు అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఈ సంక్రాంతికి విడుద‌లైన విజ‌య్ కొత్త సినిమా వారిసు డివైడ్ టాక్‌తోనే భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. లోకేష్‌తో అత‌ను చేయ‌బోయే సినిమాకు హైప్ ఒక రేంజిలో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.